English   

సమంత కూడా మొదలుపెట్టింది

Samantha's U Turn Movie False Box Office Collections
2018-09-17 09:29:39

మా సినిమా సూపర్ హిట్ అంటే జనాలునమ్మడం మానేసి చాలాకాలం అయింది. ఇప్పుడు మా సినిమా ఎలా హిట్టో అని చెప్పడానికి రివ్యూస్ రేటింగ్ స్టార్స్, కలెక్షన్స్ అన్నీ పోస్టర్ప్ పై ప్రింట్ చేస్తున్నారు. ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించాక కానీ జనాలు నమ్మడం లేదనుకోండి. లేటెస్ట్ గా నాగచైతన్య, సమంత బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. ఇద్దరూ వేర్వేరు సినిమాలతో థియేటర్ టు థియేటర్ తలపడ్డారు. ఫస్ట్ డే చైతూ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. శామ్ కు ఫర్వాలేదనే మాట వినిపించింది. కానీ శైలజారెడ్డి అల్లుడుపై అంచనాలు కాస్త ఎక్కువగా ఉండటంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. దీనివల్ల చైతూ కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఫస్ట్ డే 13కోట్ల గ్రాస్ వచ్చింది. దీంతో ఇదే ఊపు కంటిన్యూ అవుతుందనుకుంటే కాలేకపోయింది. అటు యావరేజ్ అనుకున్న సమంత సినిమా పికప్ అయింది.

Samantha's U Turn Movie Collections Poster

అయితే శైలజారెడ్డి అల్లుడు ఎలా ఉన్నా కలెక్షన్స్ అదిరిపోతున్నాయని పోస్టర్స్ కొట్టించారు. మూడు రోజుల్లో 23కోట్లు అంటూ గ్రాండ్ గా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు సమంత టర్న్ వచ్చింది. తను మాత్రం ఏం తక్కువా అంటూ మొగుడికి పోటీగా తనూ పోస్టర్స్ లో కలెక్షన్స్ వేసేసింది. ఇప్పటికే ఫస్ట్ డే నుంచే రేటింగ్ స్టార్స్ తో సందడి చేసింది. అయినా చైతూతో మరీ వెనకబడుతున్నానుకుందేమో.. తను కూడా పోస్టర్ లో కలెక్షన్స్ ప్రింట్ చేయించింది. మూడు రోజుల్లో 14కోట్లు అంటూనే.. బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ అనే క్యాప్షన్ ను కూడా యాడ్ చేశారు. మొత్తానికి టాలీవుడ్ లో ఈ వైఫ్ అండ్ హజ్బెండ్ వార్ వెరైటీగా ఉంది కదూ.. అన్నట్టు ఈ కలెక్షన్స్ లో నిజమెంత అనేది మనకు అనవసరం. అంతే.

Shailaja Reddy Alludu 3 Days Collections Posters

More Related Stories