English   

రౌడీఅల్లుడు విలన్ హఠాన్మరణం

Captain-Raju-dead
2018-09-17 11:36:38

విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన కెప్టెన్ రాజు కన్నుమూశారు. కేరళకు చెందిన ఆయన దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ లోనూ ఒక్కో సినిమాలో నటించారు. తెలుగులో రౌడీఅల్లుడు, శతృవు, మొండిమొగుడు పెంకిపెళ్లాం చిత్రాలతో ఫేమస్ అయ్యారు. ఇవాళ ఉదయం చెన్నై నుంచి మస్కట్ వెళుతుండగా విమానంలోనే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కన్నుమూశారాయన.

కెప్టెన్ రాజు అసలు పేరు డేనియల్ రాజు. సినిమాల్లోకి రాకముందు ఆయన మిలిటరీలో పనిచేశారు. అందుకే కెప్టెన్ రాజు అంటారు. ఆర్మీలో ఐదేళ్లు పనిచేసిన తర్వాత ముంబైలో ఓ కంపెనీలో మార్కెటింగ్ చీఫ్ గా జాయిన్ అయ్యారు. అక్కడే ఓ చిన్న డ్రామా ట్రూప్ లో నాటకాలు వేయడం మొదలైంది. తర్వాత మెల్లగా వెండితెరపై అడుగుపెట్టిన రాజు చాలా తక్కువ టైమ్ లోనే ఫేమస్ అయ్యారు. తెలుగులో విలన్ గానే కనిపించినా.. ఇతర భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. ముఖ్యంగా మళయాలంలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజు. నటుడుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కెప్టెన్ రాజు ఎందుకో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. ఆయన తెలుగులో నటించిన చివరి చిత్రం బాలకృష్ణ హీరోగా వచ్చిన మాతో పెట్టుకోకు. వ్యక్తిగా ఎంతో గొప్ప పేరున్న కెప్టెన్ రాజు.. విలన్ గా మాత్రం అత్యంత కౄరంగా కనిపించేవారు. కళ్లతోనే విలనీ పండించేవారు. 

నటుడుగా బిజీ అయిన టైమ్ లోనే దర్శకుడుగా రెండు సినిమాలు డైరెక్ట్ చేశారు. కొన్నాళ్లుగా టివి సీరియల్స్ లోనూ నటిస్తోన్న ఆయన ఇవాళ ఉదయం న్యూ యార్క్ వెళ్లేందుకు చెన్నైలో ఫ్లైట్ ఎక్కారు. సడెన్ గా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో విమానం ఆపేసి హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆయన మరణించారు. కెప్టెన్ రాజు మృతితో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఓ మంచి నటుడ్ని కోల్పోయింది. 

More Related Stories