English   

అరవింద సమేత ఆడియో ఫంక్షన్ లేదా..?

Aravindha-Sametha
2018-09-17 14:17:51

ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ సినిమాకు సంబంధించి ఆడియో ఫంక్షన్ లేదా..? కేవలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రమే ఉంటుందా..? అంటే అవుననే వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఈ నెల 20న నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. ఈ నెల 20న ఆడియో అన్న మాట నిజమే కానీ.. ఫంక్షన్ మాత్రం ఉండదు అని. యస్.. అంటే ఆ రోజున అన్ని పాటలను డిజిటల్ మీడియాలో విడుదల చేస్తారట. కానీ ఫంక్షన్ నిర్వహించడం లేదని ఇన్ డైరెక్ట్ గా డిక్లేర్ చేశారు. అవును.. అరవింద సమేతవీరరాఘవ సినిమాకు ఆడియో ఫంక్షన్ నిర్వహించడం లేదు. ఈ విషయం క్లియర్ గా తేల్చేసింది మూవీ టీమ్. కాకపోతే రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తారట. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తోన్న అరవింద సమేతవీరరాఘవ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలుంది. ఇక అక్టోబర్ 11న దసరా సందర్భంగా పండగకు ఒక వారం ముందుగానే విడుదల చేయబోతున్నారీ సినిమాను. అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట. మొత్తంగా ఈ న్యూస్ తో పాటు ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. రేపు(18.09.18)సాయంత్రం సినిమా నుంచి ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం అంటూ ఓ హింట్ ఇచ్చారు. అంటే మరో లిరికల్ సాంగ్ విడుదల చేయబోతుండవచ్చు. అదే అయి ఉంటుంది. ఎలాగూ మరో రెండు రోజుల్లో ఆడియో మొత్తం వచ్చేస్తుంది కాబట్టి. అందుకు తగ్గట్టుగా ఈ లిరికల్ వీడియోస్ తో ఊరిస్తున్నారనుకోవచ్చు. బట్.. ఏదేమైనా.. ఆడియో ఫంక్షన్ చేస్తే.. ఆ రోజు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తారని ఎంతో ఎక్స్ పెక్ట్ చేసిన ఫ్యాన్స్ ను మాత్రం బాగా డిజప్పాయింట్ చేశారు. సర్లే.. రేపు ఏదో సర్ ప్రైజ్ అన్నారు కదా.. అదైనా ఆకట్టుకునేలా ఉంటే అదే చాలు అనుకుంటారిక. 

More Related Stories