English   

విజయ్ దేవరకొండను ఫాలో అవుతోన్న నాని..?

Nani-Vijay-Devarakonda
2018-09-17 16:22:12

నేచురల్ స్టార్ నాని వివాదాలకు దూరంగా ఉంటాడు. కానీ లేటెస్ట్ గా ట్విట్టర్ సాక్షిగా హీరోయిన్ రష్మిక మందన్నాపై సెన్షేనల్ కమెంట్ చేశాడు. ఏంటీ నమ్మకలేకపోతున్నారా..? కానీ ఇది నిజం. అసలే పెళ్లైనవాడు. పైగా పిల్లాడు కూడా ఉన్నాడు. అలాంటిది ఈ అమ్మాయిన ‘ఫస్ట్ టైమ్ మెట్రోలో చూసినప్పుడే లోపల ఏదో రింగైంది’ అంటూ ట్వీట్ చేశాడు.. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా..? పోవాలి మరి. ఎందుకంటే నాని నిజంగానే అన్నాడు. కాకపోతే ఇది తన లేటెస్ట్ మూవీ దేవదాస్ లోని డైలాగ్. యస్.. నాని, నాగార్జున కలిసి నటిస్తోన్న దేవదాస్ సినిమాకు సంబంధించి ఇవాళ ఇద్దరు హీరోయిన్ల స్టిల్స్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తన హీరోయిన్ రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్విట్ చేసిన నాని ఈ డైలాగ్ కూడా రాశాడు.. ‘‘ఫస్ట్ టైమ్ మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే .. లోపల ఏదో రింగ్ అయ్యింది పూజగారు.. మళ్లీ ఎప్పుడు..?’’అంటూ కొంటెగా ప్రశ్నించాడు.

ఇక నాగార్జున కూడా తనదైన శైలిలో ఈ మధ్య కాలంలో ఇంత అందమైన హీరోయిన్ తో నటించడం ఇదే.. అంటూ తన హీరోయిన్ జాహ్నవిని పరిచయం చేశాడు. అమ్మడు చీరకట్టులో కాస్త పద్ధతిగా కనిపిస్తుందిలే. మొత్తంగా ఈ నెల 27న విడుదల కాబోతోన్న దేవదాస్ భామల కోసం ఈ దేవా అండ్ దాస్ లు బానే ప్రమోట్ చేస్తున్నారు. ఇక శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నానికి జోడీగా రష్మిక మందన్నా(సినిమాలో పూజ), నాగ్ కు జోడీగా ఆకాంక్ష సింగ్(సినిమాలో జాహ్నవి)లు నటించారు. ఇంకా ఇతర పాత్రల విషయంలో పెద్దగా క్లారిటీ లేదు. కానీ ఈ నెల 20 దేవదాస్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు టాక్. మొత్తంగా నాని విజయ్ దేవరకొండను ఫాలో అవుతున్నట్టుగా తన హీరోయిన్ తో ట్విట్టర్ సంభాషణ స్టార్ట్ చేశాడు. గీత గోవిందం విడుదలకు ముందు కూడా విజయ్ అండ్ రష్మికల ట్విట్టర్ రొమాన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు నాని మొదలుపెట్టాడు. మరి ఈ సారి రష్మిక ఎలాంటి ట్వీట్ రొమాన్స్ చేస్తుందో చూడాలి.

More Related Stories