English   

మూడోవాడితోనూ అదే మిస్టేకా నయనతారా..?

Nayanthara-Vignesh-Shivan
2018-09-17 16:45:46

సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతార వంటి గొప్ప ప్రేమికురాలిని ఎవరూ చూసి ఉండరు. నిజం.. తనది ఎంతో విశాల హృదయం. అందుకే ఒక ప్రేమను కోల్పోయినా మరో ప్రేమను వెదుక్కుంది. అదీ పోయినా మళ్లీ ప్రేమించగల విశాల హృదయం తనది. పైగా ప్రతి బ్రేకప్ తో తను మెచ్యూర్డ్ గా మారింది. ఇప్పుడు ఏకంగా లేడీ సూపర్ స్టార్ గా మారింది. అయితే నయనతార ఇంతకు ముందు ఇద్దరు ప్రేమికులతో చేసిన తప్పునే మళ్లీ చేస్తోందా అంటే అవుననే చెప్పాలి. అప్పుడు చేసిన మిస్టేక్ మళ్లీ చేస్తే.. అప్పటి రిజల్టే రిపీట్ కాదనే గ్యారెంటీ ఏం ఉండదు కదా.. అది సరే కానీ ఇంతకీ ఆ మిస్టేక్ ఏంటనే కదా మీ డౌట్.. 

పెళ్లికి ముందే చెట్టాపట్టాలేసుకుని తిరగడం. అవును.. అప్పుడూ అంతే ప్రేమించాక ఎంచక్కా పెళ్లి చేసుకోకుండా కలిసి తిరిగారు.. కానీ బ్రేకప్ అయింది. అంతేనా.. ఆ ప్రేమికుల కోసం తను ఏకంగా మతాలు కూడా మారేందుకు సిద్ధమైంది. అయినా ఆ ప్రేమలు నిలవలేదు. కారణం.. తను పెళ్లికంటే బయట క్యాజువల్ గా తిరగడానికే ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చింది. మొత్తంగా ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రేమలో ఉన్న నయనతార ఈ సారి కూడా అదే చేస్తోంది. 

తన లేటెస్ట్ ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి ఇలాగే తిరుగుతోంది నయన్. ఈ దర్శకుడితో డేట్ మొదలుపెట్టి ఇప్పటికే రెండేళ్లు కావొస్తోంది. అయినా ఇంత వరకూ పెళ్లి ఊసు లేదు. కానీ ఇద్దరూ కలిసి ఇలా గుళ్లూ గోపురాలే కాదు.. దేశాలు, విదేశాలు కూడా తిరిగేస్తున్నారు. ఇదుగో లేటెస్ట్ గా ఇద్దరూ కలిసి అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. గతంలో కూడా తను గోల్డెన్ టెంపుల్ కు వెళ్లడం విశేషం. ఏదేమైనా ఈ జంట ఎంత తొందగరా జతగా మారితే అంత బెటర్. లేదంటే గత రెండు ప్రేమల ఫలితాలే రిపీట్ అయ్యే ప్రమాదం లేకపోలేదని సెటైర్స్ వేస్తున్నారు కోలీవుడ్ లో. 

More Related Stories