English   

రామ్ కు మండింది.. మ‌నోజ్ కు కాలింది..

Ram-Manchu-manoj
2018-09-17 17:51:35

మ‌న కుర్ర హీరోలు చూడ్డానికి చాలా సైలెంట్ గా ఉంటారు కానీ టైమ్ వ‌చ్చిన‌పుడు వాళ్ళ‌లోంచి అప‌రిచితుడు అలా బ‌య‌టికి వ‌స్తాడు. ఇప్పుడు రామ్, మ‌నోజ్ నుంచి కూడా ఇలాగే వ‌చ్చారు బ‌య‌టికి. వీళ్ళు ఇప్పుడు కులం గురించి క్లాసులు ఇచ్చేసారు. ట్విట్ట‌ర్ లో రామ్ సీరియ‌స్ అయితే.. మ‌నోజ్ అయితే ఏకంగా ఓ లెట‌ర్ రాసాడు. ఈ మ‌ధ్య స‌మాజంలో జ‌రుగుతున్న కొన్ని విష‌యాల‌పై మ‌నోజ్ నిజంగానే చాలా సీరియ‌స్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు ప్ర‌ణ‌య్ హ‌త్య కేస్ పై కూడా ఈయ‌న ఆవేద‌న‌తో ఓ లేఖ రాసాడు. మాన‌వ‌త్వం కంటే కుల‌మ‌తాలు ఎక్కువ అనుకునే అంద‌రి కోసం ఈ లేఖ రాస్తున్నానంటూ ట్వీట్ చేసాడు మ‌నోజ్. ఇందులో చాలా విష‌యాలే చ‌ర్చించాడు మ‌నోజ్. మ‌నిషికి కులం కూడు పెట్ట‌దు.. 

మ‌నం క‌ష్టాల్లో ఉన్న‌పుడు మ‌ళ్లీ క‌చ్చితంగా తోడుగా నిలిచేది మ‌నిషే కానీ కులం కాద‌ని తీవ్రంగా మండిప‌డ్డాడు మ‌నోజ్. ఏం త‌ప్పు చేసాడ‌ని ఆ కుర్రాన్ని చంపేసార‌ని ప్ర‌శ్నించాడు. కులం పేరుతో ఇద్ద‌రు ప్రేమికుల‌ను విడ‌దీసి ఏం సాధించారంటున్నాడు మ‌నోజ్. త‌న గుండె ఇప్పుడు ప్ర‌ణ‌య్ భార్య అమృత‌తో ఉంద‌ని.. ఆ చిట్టిత‌ల్లికి దేవుడు ధైర్యాన్నివ్వాల‌ని కోరుకున్నాడు మ‌నోజ్. అలాగే ఆ కుటుంబానికి సానుభూతి తెలిపాడు. ప్ర‌ణ‌య్ మేం నిన్ను కాపాడుకోలేక‌పోయాం వెరీ సారీ బ్ర‌ద‌ర్ అంటూ ఆవేద‌న‌తో లెట‌ర్ రాసాడు మ‌నోజ్. ఇక రామ్ కూడా సీరియ‌స్ గానే వార్నింగ్ ఇచ్చాడు. ఓ వైపు గే క‌ల్చ‌ర్ కూడా ఓకే అని సెక్ష‌న్ 377 సైతం సుప్రీమ్ కోర్ట్ తీసేసింది. మ‌న దేశం ఇంత అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా కులాల కోసం చంపుకోవడాలేంట్రా.. మారండ్రా నాయ‌నా.. ఇంకా కులం, మ‌తం ఏంట్రా జంగిల్ ఫెలోస్.. క‌నీసం మ‌న‌షులు మ‌నుషుల్లా బ‌త‌కడం కాస్తేనా నేర్చుకోండి అంటూ ట్వీట్ చేసాడు. మొత్తానికి కులం పేరుతో జ‌రిగిన హ‌త్య‌కు అంతా బాగానే స్పందిస్తున్నారు కానీ మ‌ళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటే అప్పుడు నిజంగానే ప్ర‌ణ‌య్ హ‌త్య చివ‌రిది అవుతుంది. 

More Related Stories