English   

రామ్ చెప్పింది కరెక్టే.. టీజర్ 'హాట్' గా ఉంది 

Hello-Guru-Prema-Kosame
2018-09-17 18:07:46

రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న సినిమా ‘హలో గురూ ప్రేమకోసమే’. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీకి నక్కిన త్రినాథరావు దర్శకుడు. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ తో ఆకట్టుకున్న టీమ్ లేటెస్ట్ గా టీజర్ విడుదల చేసింది. ముందు నుంచీ ఈ టీజర్ గురించి రామ్ చెబుతూనే ఉన్నాడు. హాట్ గా ఉంటుంది.. అని. హాట్ గా ఉంటుందంటే ఏంటో అనుకున్నాం.. కానీ టీజర్ చూస్తే తెలిసింది. నిజంగానే చాలా హాట్ గా ఉంది.. పైగా అనుపమా కూడా రూట్ మార్చినట్టుగా ఉందీ హాట్ నెస్ తో.ఉదయాన్నే లేచి అనుపమా కురులు ఆరబెట్టుకుంటూ ఉంటుంది.. వెనుతిరిగి ఉన్న తన నడుము ఒంపులు ను అప్పుడే లేచి బయటకు వచ్చిన రామ్ చూస్తాడు.. తను అతన్ని చూడకుండానే ‘‘చూశావా’’ అంటుంది. చూశా అన్నట్టుగా రామ్ సైగలు చేస్తాడు.. ‘కాఫీ అక్కడ ఉంది’ అంటుంది. తను తీసుకుని తాగుతూనే.. తన నడుము అందాలను ఆస్వాదిస్తుంటాడు... ‘ఎలా ఉంటుంది’ అంటుంది తను.. ‘‘హాట్ గా ఉంది’’ అంటాడు ఇతను.. తను షార్ప్ గా చూస్తుంది.. ‘కాఫీ’ అంటాడు రామ్.. అర్థమైంది కదా.. ఇది చదువుతూ ఉన్పప్పుడే ఎంత రొమాంటిక్ గా ఉందో.. ఇంక టీజర్ లో  చూస్తే నిజంగానే హాట్ గా అదిరిపోయింది అనిపించక మానదు. 

మొత్తంగా రామ్ అండ్ అనుపమకు ఈ సినిమా చాలా కీలకం. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో ఉన్నారిద్దరూ. ఈ టీజర్ చూస్తుంటే వారి కోరిక నెరవేరేలానే ఉంది. అటు ఇక టీజర్ ఆసాంతం దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. కాకపోతే ఈ చూస్తున్నంత సేపూ ఎంత ఒద్దనుకున్నా ఒక విషయం గుర్తొస్తుంది. అదే.. నేను లోకల్ సినిమాలోని టీజర్. త్రినాథరావు గత సినిమా నేను లోకల్ లో కూడా హీరో హీరోయిన్లతో ఇలాంటి రొమాంటిక్ ఫీట్ ఒకటి చేయించాడీ దర్శకుడు. ఓ బట్టల షాప్ లో హీరోయిన్ డ్రెస్ చూస్తుంటుంది. హీరో పక్కకు రమ్మంటాడు. తను రానంటుంది. ఇతను గేలం వేస్తాడు.. వచ్చి ఒళ్లో వాలుతుంది.. ఇదంతా అప్పుడు ‘మైమ్’గా ఉంటుంది. ఇప్పుడూ అలానే కనిపించింది. అలాగని ఇది బాలేదు అనడం లేదు. సూపర్బ్ గా ఉంది. బట్ అప్పుడా సీన్ సినిమాలో లేదు. మరి ఇదైనా ఉంటుందా అనేది డౌట్. ఎందుకంటే లేకపోతే ఇంత హాట్ నెస్ మిస్ అవుతాం కదా..

More Related Stories