English   

దేవ‌దాస్ పాట‌ల పండ‌గ చేసుకుంటున్నారు..

Deva-Das
2018-09-17 14:37:55

నాని, నాగార్జున హీరోలుగా న‌టిస్తున్న దేవ‌దాస్ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఒక్కో పాట‌.. ఒక్కో టీజ‌ర్.. ఒక్కో పోస్ట‌ర్ రిలీజ్ అవుతుంటే సినిమాపై అంచ‌నాలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆడియో వేడుక సెప్టెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ లోని ఓ స్టార్ హోట‌ల్ లో ఈ ఈవెంట్ భారీగా ప్లాన్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా చెట్టు కింద డాక్ట‌ర్.. మొన్న వినాయ‌క‌చ‌వితికి విడుద‌లైన ల‌క ల‌క లంకుమిక‌రా పాట‌ల‌కు రెస్పాన్స్ అదిరిపోయింది. మ‌ణిశ‌ర్మ ఈ సినిమాతో మ‌రోసారి స‌త్తా చూపిస్తున్నాడు. 

సెప్టెంబ‌ర్ 17న నాగార్జున‌, నాని సినిమాలో త‌మ‌కు జోడీగా న‌టించిన హీరోయిన్లు ఆకాంక్ష సింగ్, ర‌ష్మిక మంద‌న్న‌ల పాత్ర‌లు.. వాళ్ల పేర్ల‌ను వాళ్ల వాళ్ల ట్విట్ట‌ర్ లో విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసారు. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌రేష్ వికే, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా గ్రూప్ వ‌యాక‌మ్ 18 వ‌చ్చి దేవ‌దాస్ కోసం వై జ‌యంతి బ్యాన‌ర్ తో టై అప్ కావ‌డంతో అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా దేవ‌దాస్ విడుద‌ల కానుంది. మొత్తానికి వ‌ర‌స ప్లాపుల్లో ఉన్న నాగార్జున‌.. మూడేళ్ల త‌ర్వాత ఫ్లాప్ ఇచ్చిన నానికి ఈ సినిమా కీల‌కంగా మారింది. చూడాలిక‌.. దేవ‌దాస్ తో ఎలాంటి మ్యాజిక్ చేయ‌బోతున్నారో ఈ ఇద్ద‌రూ..!

More Related Stories