English   

రష్మిక.. కన్నడ భర్తనే కాదు.. భాషనూ వదిలేస్తోందా..?

Rashmika-Mandanna
2018-09-18 09:18:53

రష్మిక మందన్నా.. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మార్మోగుతున్న పేరు. తనిప్పుడు హిట్ మెషీన్ గా మారింది. ఐరన్ లెగ్ అంటున్నారు. తను నటిస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ బలపడింది. లేటెస్ట్ గా గీత గోవిందంతో వంద కోట్ల క్లబ్ లో ఎంటర్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ రేంజ్ హీరోలకు ఫస్ట్ ప్రియారిటీగా మారింది. మరి తన రేంజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళుతుందా లేదా అనేది తెలియదు కానీ.. లేటెస్ట్ గా రష్మిక తీసుకుంటోన్న నిర్ణయాలు తను కన్నడ భర్తకే కాదు.. కన్నడ భాషకు కూడా దూరం అవుతోందనే విషయాన్ని క్లియర్ చేస్తున్నాయి. యస్.. రష్మిక కన్నడ సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదనేది బలంగా వినిపిస్తోంది. 

రష్మిక హీరోయిన్ గా చేసిన ఫస్ట్ మూవీ ‘కిరిక్ పార్టీ’. ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ కావడంతో కన్నడనాట ఓవర్ నైట్ సెన్షేషన్ అయిపోయిందీ బ్యూటీ. అదే టైమ్ లో తనకు ఇంత ఫేమ్ వస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. అందుకే వెంటనే ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. చాలా త్వరగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఎంగేజ్మెంట్ కు ముందే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన అవకాశం వచ్చింది. ఆ వెంటనే మరో స్టార్ హీరో గోల్డెన్ స్టార్ గణేష్ తోనూ నటించింది. కానీ తనకు అప్పుడు అంత ఫేమ్ రాలేదు. బట్ తెలుగులో ఛలో బ్లాక్ బస్టర్ కొట్టి పాగా వేసింది. ఇక గీత గోవిందం తర్వాత అమ్మడు హాట్ కేక్ అయింది. దీంతో సడెన్ గా తన ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని షాక్ ఇచ్చింది. ఈ విషయంలో విజయ్ దేవరకొండ తో తను చేసిన ‘ట్విట్టర్ రొమాన్స్’పైనే శాండల్ వుడ్ లో చాలా డిస్కషన్ జరిగింది. ఫైనల్ గా ఆ ఇష్యూ ఏకంగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకునేవరకూ వెళ్లింది. ఇక ఏమనుకుందో అమ్మడు ప్రస్తుతం కన్నడ సినిమాలు కూడా వద్దనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత రష్మిక యాటిట్యూడ్ కూడా బాగా మారిపోయిందనేది కన్నడ ఆడియన్స్ ఆరోపణ. అది నిజమే అనేలా తనిప్పుడు కన్నడ సినిమాలు కూడా వద్దనుకుంటోంది. 

యస్.. ఆల్రెడీ ఒప్పుకున్న ఓ సినిమా నుంచి కూడా తప్పుకుంది. కన్నడ దర్శకుడు గౌతమ్ అయ్యర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రష్మిక గతంలోనే ఒప్పుకుంది. ఆ సినిమా పేరు ‘వృర్ త్ర’. తను ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఈ విషయం తనే ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. కన్నడ భర్తే కాదు.. భాష కూడా వద్దనుకుంటోందా అంటూ అక్కడ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. తనకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లే ఈ కన్నడ సినిమా నుంచి తప్పుకుంటున్నానని.. ఈ విషయం దర్శకుడితో మాట్లాడానని.. ఆయన ఒప్పుకున్నారని ట్విట్టర్ లో ప్రకటించింది. మొత్తంగా రష్మికకు తెలుగు నీళ్లు బాగా పడినట్టున్నాయి. ఇలా ఏకంగా వెంట వెంటనే కన్నడ నుంచి దూరం అవుతోంది. మరి ఈ విషయంలో రష్మిక మందన్నా ఇంకెన్ని ‘కొత్త’ నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. 

More Related Stories