English   

రామ్ ను టార్గెట్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. 

Vijay-Devarakonda-NOTA
2018-09-18 12:34:46

అంతా అనుకున్న‌ట్లు జ‌రుగుతుంటే అది సినిమా అవుతుంది కానీ జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి..? ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న ఇప్పుడు ఓ సంచ‌ల‌నం. విజ‌య్ సినిమా వ‌చ్చిందంటే బాక్సాఫీస్ కుమ్మేయ‌డం ఖాయం. ప్ర‌స్తుతం ఈయ‌న నోటా సినిమాతో వ‌స్తున్నాడు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న విడుద‌ల కానుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే క‌న్ఫ‌ర్మేష‌న్ మాత్రం రాలేదు. పూర్తిస్థాయి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా నోటా వ‌స్తుంది. ఆనంద్ శంక‌ర్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కిస్తున్నాడు. విజ‌య్ ఈ సినిమాతోనే త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్తున్నాడు. ఇందులో ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్తైపోయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది నోటా.

అయితే ఈ చిత్రం ఇప్పుడు అక్టోబ‌ర్ 4న రావ‌డం లేదు.. దీన్ని వాయిదా వేసిన‌ట్లు తెలుస్తుంది. రెండు వారాలు ఆగి.. అంటే అక్టోబ‌ర్ 18న ద‌స‌రా కానుగ‌కా విడుదల చేయాల‌ని చూస్తున్నారు. ఆ రోజు పందెంకోడి 2 తో పాటు రామ్ హ‌లో గురు ప్రేమ‌కోస‌మే కూడా రానున్నాయి. కానీ అవేం ప‌ట్టించుకోకుండా అదే రోజు విజ‌య్ కూడా రావాల‌నుకుంటున్నాడు. ఈయ‌న వ‌చ్చాడంటే వాళ్ల‌కు పిడి త‌ప్ప‌దు. అందుకే దిల్ రాజు రంగంలోకి దిగి విజ‌య్ సినిమాను ముందుగానో.. వెన‌క‌గానో ప‌డేలా చూసుకుంటున్నాడు. అయినా ఉన్న‌ట్లుండి ఇలా తేదీలు మార్చుకుంటే ఇత‌ర హీరోల‌కు.. సినిమాల‌కు ఎంత ఇబ్బంది అవుతుందో..? అది ఆలోచించ‌కుండా విజ‌య్ వ‌చ్చేస్తున్నాడు. మ‌రి నోటాతో ఎవ‌రి క‌లెక్ష‌న్ల కోటాకు దెబ్బ‌ప‌డుతుందో చూడాలి.

More Related Stories