English   

ర‌వితేజ‌కు షాకిచ్చిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ..

Amar-Akbar-Anthony
2018-09-18 13:26:55

అంతా సాఫీగా సాగిపోతుంటే కిక్ ఏం ఉంటుంది చెప్పండి..? అందుకే ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాస్త కొత్త ట్విస్టులు తీసుకొస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అనుకున్న టైమ్ కు జ‌రుగుతుంది.. అనుకున్న‌ట్లుగానే అన్ని షెడ్యూల్స్ పూర్త‌వుతున్నాయి.. అనుకున్న‌ట్లుగానే ఇలియానా నెల రోజుల ముందే త‌న భాగం షూట్ పూర్తి చేసుకుని వెళ్లిపోయింది.. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది.. అన్నీ అనుకున్న‌ట్లుగానే జ‌రుగుతున్నాయి. పైగా ఫ‌స్ట్ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో అటు శీనువైట్ల‌.. ఇటు ర‌వితేజ ఆనందంగా ఉన్నారు. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ త‌మ ఇద్ద‌రి ఆక‌లిని తీరుస్తుంద‌నే ఆశ‌తో ఉన్నారు. కానీ అంత‌లోనే పిడుగు లాంటి వార్త‌. ఈ చిత్రం పోస్ట్ పోన్ కానుంద‌ని తెలుస్తుంది. ఒక‌టి రెండు వారాలు కాదు ఏకంగా రెండు నెల‌ల త‌ర్వాత రానుంది ఈ చిత్రం. అక్టోబ‌ర్ 5 అంటూ ముందు నుంచి ప్ర‌చారం చేస్తూ ఉన్నా కూడా ఈ డేట్ కు మ‌రో నెల రోజులు కూడా లేదు. కానీ ఇప్ప‌టికీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా బాకీ ఉంది. దాంతో హ‌డావిడిగా విడుద‌ల చేస్తే లేనిపోని త‌ల నొప్పులు వ‌స్తాయ‌ని ముందుగానే ఊహించి.. రెండు నెల‌లు సినిమాను వాయిదా వేసార‌ని తెలుస్తుంది. డిసెంబ‌ర్ 14న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ విడుద‌ల కానుంది. ఆ మ‌రుస‌టి వార‌మే అంత‌రిక్షం.. అఖిల్ సినిమా.. యాత్ర.. ప‌డిప‌డి లేచే మ‌న‌సు కూడా రానున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ వాయిదాతో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ జాత‌కం ఎలా మార‌నుందో..? 

More Related Stories