English   

త‌మిళ్ అర్జున్ రెడ్డిపై బ్రేకింగ్ న్యూస్..

Dhruv-Vikram
2018-09-18 13:44:13

అర్జున్ రెడ్డి.. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వినిపించిన పేరు ఇది. చిన్న సినిమాగా మొద‌లై.. సంచ‌ల‌నం సృష్టించిన సినిమా ఇది. మూడున్న‌ర కోట్ల‌తో తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి.. 25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ చిత్రం ఇప్పుడు చాలా భాష‌ల్లో రీమేక్ అవుతుంది. ఇప్ప‌టికే హిందీలో షాహిద్ క‌పూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగానే తెర‌కెక్కిస్తున్నాడు. ఇక త‌మిళ్ లో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ కృష్ణ న‌టిస్తున్నాడు. అక్క‌డ వ‌ర్మ‌గా వ‌స్తున్నాడు అర్జున్ రెడ్డి. తండ్రి మాదిరే తొలి సినిమా తోనే ప్రయోగం చేస్తున్నాడు ధృవ్. అర్జున్ రెడ్డి రెగ్యుల‌ర్ సినిమా కాదు. ఇందులో చాలా డేరింగ్ సీన్స్ ఉన్నాయి. వాటిని త‌ట్టుకుని చేస్తే ధృవ్ కు మంచి ప్లాట్ ఫాం ప‌డిన‌ట్లే. పైగా ఈ చిత్రానికి బాల ద‌ర్శ‌కుడు కావ‌డంతో అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిపోయింది. ఇందులో మేఘా చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తుంది. సెప్టెంబ‌ర్ 17న చివ‌రి స‌న్నివేశం పూర్తి చేసాడు బాల‌. ఈ పాత్ర కోసం త‌న‌ను తాను చాలా ప్రిపేర్ చేసుకున్నాడు ధృవ్. ముఖ్యంగా ముద్దు సీన్ల విష‌యంలో కూడా బాల చాలా ప‌చ్చిగా తీస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ సినిమా తెలుగు కంటే త‌మిళ్ లో మ‌రింత రాగా ఉంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళ ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లుగా క‌థ‌లో కూడా కొన్ని మార్పులు చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే క‌థ‌లోని ఆత్మ పోకుండానే ఇవ‌న్నీ చేస్తున్నాడు బాల‌. ఇదే ఏడాది వ‌ర్మ సినిమా విడుద‌ల కానుంది. 

More Related Stories