సమంత సోషల్ మెసేజ్ కవితకు నచ్చిందట

సమంత నటించిన యూ టర్న్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. తొలిరోజే చాలా మంచి ప్రయత్నం అంటూ అంతా నెత్తిన పెట్టుకున్నారు ఈ చిత్రాన్ని. రెండేళ్ల పాటు వేచి చూసినందుకు సమంత నిజంగానే మంచి సినిమా చేసిందని ప్రశంసల వర్షం కురిసింది. అయితే కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా కాస్త వెనకబడింది. అయితే ఇప్పుడు యూ టర్న్ సినిమా సక్సెస్ మీట్ దస్పల్లాలో జరిగింది. దానికి టిఆర్ఎస్ ఎంపి కవిత ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కినేని కుటుంబంతో.. ముఖ్యంగా సమంతతో కవితకు మంచి అనుబంధం ఉంది. ఆ మధ్య తెలంగాణ చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీతో సమంతకు మంచి రిలేషన్ ఉంది. ఇక ఇప్పుడు ఈమె సక్సెస్ మీట్ కు వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చాలా మంది ఇష్టమొచ్చినట్లు చేస్తున్న ఇలాంటి సమయంలో ఇలాంటి మంచి సినిమాలు రావడం ఆనందంగా ఉందని చెప్పింది కవిత.
ముఖ్యంగా యూ టర్న్ థీమ్ తనకు నచ్చిందని చెప్పారీమే. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి సోషల్ మెసేజ్ ఉన్న కథలు చేయడం వల్ల అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పింది కవిత. యూ టర్న్ చూసానని.. ప్రతీ పౌరుడు రూల్స్ పాటించాలని చక్కగా చూపించారని చెప్పింది కవిత. సమంత నటన అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది కవిత. అలాగే చైతన్య, సమంత సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి అంటే ఇంట్లోనే కాదు.. బయట కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉందని వాళ్లు నిరూపించారని.. వాళ్ల మధ్య రిలేషన్ కు అది నిదర్శనం అని చెబుతుంది ఈమె. 6వ తరగతి చదువుతున్న మా అబ్బాయి యూ టర్న్ సినిమా చూసి మంచి రివ్యూ ఇచ్చాడని చెబుతుంది కవిత. మరోవైపు సమంత కూడా తనకు కవిత అన్నా.. ఆమె స్పీచ్ లన్నా కూడా చాలా ఇష్టమని.. అన్నీ ఫాలో అవుతుంటానని చెప్పింది. ఇద్దరూ ఒకరిని ఒకరు భలే పొగిడేసుకున్నారు.