English   

చిరంజీవి ఎక్క‌డున్నాడు.. సైరా కోసం వెళ్ల‌లేదా..?

sye-raa-narasimha-reddy
2018-09-18 15:54:08

అదేం ప్ర‌శ్న‌.. ఈయ‌న ఇప్పుడు సైరా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు క‌దా అనుకుంటున్నారా..? అవును నిజ‌మే కానీ సైరా షూటింగ్ జ‌రుగుతుంది కానీ చిరు మాత్రం అక్క‌డ లేడు. ఈయ‌న ఇంకా హైద‌రాబాద్ లోనే ఉన్నాడు. ఇక్క‌డే ఉండి కొత్త సినిమాల ట్రైల‌ర్స్.. పాట‌లు విడుద‌ల చేస్తున్నాడు. త‌న‌కు కావాల్సిన వాళ్ల‌తో కాలం గ‌డుపుతున్నాడు. సైరా షూటింగ్ జ‌రుగుతున్న మాట వాస్త‌వమే అయినా కూడా చిరు మాత్రం యూర‌ప్ ఇంకా వెళ్ల‌లేదు. ఈయ‌న వెళ్ల‌డానికి ఇంకా టైమ్ ఉంది. 

భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ల కోసం యూర‌ప్ దేశాల‌ను ఎంచుకున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఇప్పుడు ఈ చిత్ర టీం అక్క‌డే ఉంది. 40 రోజుల పాటు యూర‌ప్ షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దీనికోసం దాదాపు 30 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు చేస్తున్నారు. అయితే ఈ 40 రోజుల్లో చిరు అక్క‌డ 20 రోజులు మాత్ర‌మే ఉంటే చాలు. ఆ టైమ్ ఇంకా రాలేదు. అందుకే ఇక్క‌డే ఉన్నాడు. త్వ‌ర‌లోనే ఈయ‌న కూడా యూర‌ప్ వెళ్ల‌నున్నాడు.. అక్క‌డి టీంతో జాయిన్ కానున్నాడు. జార్జియాతో పాటు ర‌ష్యాలో కూడా భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు ప్లాన్ చేసాడు సురేంద‌ర్ రెడ్డి. జార్జియా అంటే బాల‌య్య న‌టించిన శాత‌క‌ర్ణి గుర్తొస్తుంది. 

ఈ చిత్రంలోని చాలా యుద్ధ స‌న్నివేశాలు అక్క‌డే చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు క్రిష్. ఇప్పుడు చిరు కూడా బాల‌య్య వెళ్లిన చోటుకే వెళ్తున్నాడు. యూర‌ప్ షెడ్యూల్ లో భారీగా జూనియర్ ఆర్టిస్ట్ లు ఉండ‌బోతున్నారు. దీనికోసం వీళ్ల‌కు హైద‌రాబాద్ లోనే ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా ఇచ్చారు కూడా. చిరు కూడా ఈ శిక్ష‌ణ తీసుకోనుండ‌టం విశేషం. ఈయ‌న‌తో పాటే విజ‌య్ సేతుప‌తి కూడా ఇదే షెడ్యూల్ లో అడుగు పెడుతున్నాడు సినిమాలోకి. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రెగ్ పావెల్ నేతృత్వంలో యాక్ష‌న్ సీక్వెన్సులు తెర‌కెక్కించ‌గా.. ఇప్పుడు రాబోయే షెడ్యూల్ కోసం మ‌రో హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ లీ విట్టేకర్ ను తీసుకొచ్చారు. వ‌చ్చే ఏడాది సైరా విడుద‌ల కానుంది. 

More Related Stories