English   

రాధికా ఆప్టే: నీకు మ‌సాజ్ చేయాలా అని అడిగాడు

Radhika Apte Opened up Sexual Harrasment in Film Industry
2018-09-18 18:25:14

కొన్ని ప‌దాలు ప‌ది మందిలో ప‌ల‌క‌డానికి కూడా కాస్త సిగ్గు ప‌డ‌తాం. కానీ రాధిక ఆప్టే మాత్రం ఈ విష‌యంలో అస్స‌లు సిగ్గు ప‌డ‌ట్లేదు. పైగా ఎంత‌మంది ఉన్నా ధైర్యంగా మాట్లాడేస్తుంది. ఇండ‌స్ట్రీలో జ‌రిగే అకృత్యాల‌పై మాట్లాడ‌టంలో రాధిక ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ భామ‌. బాలీవుడ్ లో ఓ మేల్ ఆర్టిస్ట్ గురించి సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. తాను ఓ చిత్ర షూటింగ్ లో ఉన్న‌పుడు న‌డుమునొప్పిగా ఉన్నా కూడా షెడ్యూల్ పూర్తి చేసాన‌ని.. ఆ త‌ర్వాత హోట‌ల్ రూమ్ కు వెళ్తే ఆ చిత్రంలో పని చేసే మేల్ ఆర్టిస్ట్ వ‌చ్చి అస‌భ్యంగా త‌న‌తో మాట్లాడాడ‌ని చెప్పింది రాధిక‌.  తాను ప‌క్క రూమ్ లోనే ఉంటాన‌ని.. కావాలంటే అర్ధ‌రాత్రి వ‌చ్చి న‌డుము మ‌సాజ్ చేస్తాన‌ని అస‌భ్య‌క‌రంగా త‌న‌తో ప్ర‌వ‌ర్తించాడ‌ని సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టింది రాధికాఆప్టే. అయితే ఆ మేల్ ఆర్టిస్ట్ ఎవ‌రు అనే విష‌యంపై మాత్రం నోరు విప్ప‌లేదు రాధిక‌. కావాల‌నే పేరు బ‌య‌ట‌పెట్ట‌కుండా విష‌యం బ‌య‌ట‌పెట్టింది రాధికాఆప్టే. ఇలాంటి ఇష్యూస్ ను ఓపెన్ గా మాట్లాడ‌టం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ ఓ సారి రాధిక తెలుగు ఇండ‌స్ట్రీపై ఫైర్ అయింది.

ఇక్క‌డ హీరోయిన్ల‌కు వ్యాల్యూ ఉండ‌ద‌ని.. ఎవ‌రు ఇష్ట‌మొచ్చిన‌ట్లు వాళ్లు ఆడ‌వాళ్ల‌ను ట్రీట్ చేస్తార‌ని చెప్పింది రాధిక‌. ఇక త‌న‌ను ఓ హీరో ప‌డ‌క‌గ‌దికి పిలిచాడ‌ని కూడా చెప్పింది రాధిక ఆప్టే. త‌ర్వాత ఓ నిర్మాత‌పై కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. మొద‌ట్లో త‌న‌ను ఓ నిర్మాత సినిమా గురించి మాట్లాడతాన‌ని హోటల్ కి పిలిపించి.. ప‌డ‌క‌గ‌దికి రావాలంటూ అడిగాడ‌ని చెప్పింది రాధిక‌. కానీ తాను మాత్రం దానికి ఒప్పుకోలేద‌ని.. బ‌హుశా అందుకే తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కు అవ‌కాశాలు రావ‌ట్లేదంటూ ఓపెన్ గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది రాధిక ఆప్టే. ఇప్పుడు బాలీవుడ్ హీరో గురించి ఇలాగే చెప్పింది. మొత్తానికి ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు ఎక్క‌డా కూడా ఓ సెక్యూరిటీ అనేది ఉండ‌దని చెబుతుంది రాధికాఆప్టే. మ‌రి ఈమెను అంత‌గా ఇబ్బంది పెట్టిన ఆ హీరో ఎవ‌రో..?

More Related Stories