English   

అందరికి క్లారిటీ ఇచ్చిన రష్మిక

Rashmika Mandanna Opened up on Engagement Breakup
2018-09-19 06:33:17

రెండేళ్ల కింద కిరిక్ పార్టీతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ర‌ష్మిక మంద‌న్న‌. వ‌స్తూ వ‌స్తూనే అంద‌ర్నీ మాయ చేసింది. అస‌లు ఎవ‌రీ ముద్దుగుమ్మంటూ అంతా ఆమె వైపు చూసారు. తొలి సినిమానే బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో ర‌ష్మిక క‌న్న‌డ‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్ప‌టికే తొలి సినిమా హీరో ర‌క్షిత్ శెట్టితో ప్రేమ‌లో కూడా ప‌డిపోయింది. నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే ఈ మ‌ధ్యే వీళ్ల ఎంగేజ్ మెంట్ బ్రేక్ అయిపోయింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్న ర‌ష్మిక‌.. స్టార్ ఇమేజ్ లేని ర‌క్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోలేక దూర‌మైపోయింద‌నే వార్త‌లు చాలానే వ‌చ్చాయి. త‌ను ఇంత పెద్ద స్టార్ అవుతాన‌ని ర‌ష్మిక ఊహించ‌లేద‌ని.. అందుకే ముందుగా ర‌క్షిత్ ను పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంద‌ని.. కానీ ఇప్పుడు స్టార్ స్టేట‌స్ వ‌చ్చేస‌రికి అత‌న్ని వ‌దిలేసింద‌ని ఏవేవో క‌థనాలు మీడియాలో వ‌చ్చాయి. అయితే అన్నీ చూస్తూ వ‌చ్చిన ర‌ష్మిక ఇప్పుడు మ‌న‌సు విప్పింది. త‌న నిశ్చితార్థం బ్రేక‌ప్ పై ఎన్నో వార్త‌లు వ‌స్తున్నాయి.. అన్నీ తాను చ‌దివాన‌ని చెబుతుంది ర‌ష్మిక‌. అయితే ఈ విష‌యంలో ఎవ‌ర్నీ త‌ప్పు ప‌ట్ట‌డం లేద‌ని.. ఇండ‌స్ట్రీలో ఉన్న‌పుడు ఇవ‌న్నీ కామ‌న్ అని త‌న‌కు కూడా తెలుస‌ని చెప్పింది ఈ భామ‌.

ర‌క్షిత్ విష‌యంలో కానీ.. త‌న విష‌యంలో కానీ అంద‌రూ నాణేనికి ఒక వైపు మాత్ర‌మే చూస్తున్నార‌ని.. కానీ ఖచ్చితంగా రెండో వైపు అనేది ఒక‌టి ఉంటుంద‌ని అది కూడా చూస్తే బాగుంటుంద‌ని చెబుతుంది ఈ భామ‌. ఇక ఎవ‌రైనా సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్నారో.. అంత కాస్త మ‌న‌శ్శాంతితో ప‌ని చేయాల‌ని కోరుకుంటార‌ని చెప్పింది ర‌ష్మిక. అందుకే తాను కూడా అదే చేయాల‌నుకుంటున్నాన‌ని.. ఈ విష‌యంపై క్లారిటీ ఇవ్వ‌డానికి కాదు.. క‌నీసం నాణేనికి రెండు వైపులా ఆలోచించాల‌ని కోరుకోడానికి మాత్ర‌మే క్లారిటీ ఇచ్చాన‌ని చెప్పింది ర‌ష్మిక‌. ఎవ‌రేం అనుకున్నా.. తాను ఇండ‌స్ట్రీకి న‌టించ‌డానికి వ‌చ్చాన‌ని.. క‌న్న‌డ సినిమాలు కూడా చేస్తాన‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. భాష ఏదైనా ఎంట‌ర్ టైన్ చేయ‌డం ఒక్క‌టే త‌న ధ్యేయ‌మ‌ని చెబుతుంది ఈ భామ‌. మ‌రి మ‌న‌శ్శాంతి కావాల‌నుకుంటుంది అంటే ర‌క్షిత్ విష‌యంలో అది లేదా అనేది సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న కామెంట్స్.. మ‌రి దీనికి ర‌ష్మిక నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో..?

More Related Stories