English   

ఇది నిజమేనా: పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గ ప్రభాస్ ఫ్యాన్స్

Will Prabhas Fans Give Support to Pawan Kalyan's Janasena?
2018-09-19 08:19:25

ఏమో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌లు ఇవే. జ‌న‌సేన‌లో సీనియ‌ర్ హీరో కృష్ణంరాజు చేరుతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈయ‌న‌కు చిరంజీవి కుటుంబంతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అప్ప‌ట్లో ఈయ‌న చిరంజీవి ప్ర‌జారాజ్యం పెట్టిన‌పుడు అందులో కూడా జాయిన్ అయ్యారు. అసెంబ్లీకి కూడా పోటీచేసారు కృష్ణంరాజు. అయితే ఓడిపోయారు అది వేరే విష‌యం. మ‌ళ్లీ ఆ త‌ర్వాత రాజ‌కీయాల వైపు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు ఈయ‌న‌. బిజేపికి ఎప్ప‌ట్నుంచో అనుకూలంగానే ఉన్నాడు రాజుగారు. ఇక ఇప్పుడు ఈయ‌న చూపులు జ‌న‌సేన వైపు ఉన్నాయ‌నే వాద‌న వినిపిస్తుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కూడా కృష్ణంరాజు మాట్లాడార‌ని.. పెద్దాయ‌న రాక‌కు ప‌వ‌న్ కూడా ఓకే చెప్పేసార‌నే టాక్ న‌డుస్తుంది.

ఇదే కానీ జ‌రిగితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌రో ఆర్మీ తోడైన‌ట్లే. ఎందుకంటే కృష్ణంరాజు అంటే ప్ర‌భాస్ కూడా స‌పోర్ట్ ఇచ్చిన‌ట్లే. అంటే ప‌వ‌న్ కు అండ‌గా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కూడా అడుగేస్తారు. ఇక మెగా అభిమానులు కూడా ల‌క్ష‌ల్లో ఉన్నారు. చిరంజీవి అభిమాన సంఘాలు కూడా ఇప్పుడు జ‌న సేన‌తోనే ఉన్నాయి. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్, బ‌న్నీ లాంటి హీరోలు కూడా ప‌వ‌న్ ఆజ్ఞ కోసం చూస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప‌వ‌ర్ స్టార్ ఒంటరి కాద‌ని ఇవ‌న్నీ చెబుతున్నాయి. ఇప్పుడు కానీ నిజంగానే కృష్ణంరాజు కానీ జ‌న‌సేన‌లో చేరితే అది పెద్ద సంచ‌ల‌నం అవుతుంది. ప్ర‌భాస్ అభిమానుల స‌పోర్ట్ కూడా ప‌వ‌న్ కు వ‌స్తుంది. మ‌రి చూడాలి.. ఇది ఎంత‌వ‌ర‌కు జ‌రుగుతుందో..? అయితే ఆయ‌న ఇప్పుడు జ‌న‌సేన‌లో చేరి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌ద్దతు ఇవ్వ‌డం వెన‌క మ‌త‌లబు మాత్రం అంతుచిక్క‌డం లేదు.

More Related Stories