English   

ఎయిర్ టెల్ బ్యూటీ ఇర‌గ‌దీస్తుంది

Airtel Beauty Sasha Chettri Debut With Telugu Movie
2018-09-19 09:27:58

సాషా ఛ‌ట్రీ.. ఈ పేరంటే ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఈమె మొహం తెలియ‌ని ఇండియ‌న్ ఉండ‌డు. అంత‌గా ఫేమ‌స్. హీరోయిన్ల‌కు కూడా అంత క్రేజ్ ఉంటుందో ఉండ‌దో తెలియ‌దు కానీ సాషాకు మాత్రం ఉంది. ఇంత‌కీ ఈమె ఏం చేస్తుంద‌నేగా అనుమానం.. అయితే ఒక్క‌సారి ఎయిర్ టెల్ యాడ్ ను గుర్తు చేసుకోండి. టీవీ పెట్ట‌గానే ఇండియా మే స‌బ్ సే బ‌డా నెట్ వ‌ర్క్ క్యా హై అంటూ స్వీట్ వాయిస్ తో మాయ చేసే ఎయిర్ టెల్ పాప పేరు సాషా ఛ‌ట్రీ. 17 ఏళ్ల‌కే ఎయిర్ టెల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపికైంది ఈ డెహ్రాడూన్ బేబీ. ఇక అప్ప‌ట్నుంచి వెన‌క్కి తిరిగి చూసుకోలేదు ఈ బ్యూటీ. 2016లో ఇండియాస్ మోస్ట్ స‌ర్చ్ డ్ సెలెబ్రెటీస్ లో టాప్ 3లో చోటు కూడా ద‌క్కించుకుందంటే న‌మ్మ‌డం సాధ్యం కాదు. అంత‌గా పాపుల‌ర్ అయింది ఈ భామ‌.

Airtel Beauty Sasha Chettri Debut With Telugu Movie

ఎయిర్ టెల్ పుణ్య‌మా అని బాలీవుడ్ హీరోయిన్స్ కంటే ఎక్కువ పాపుల‌ర్ అయింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం ఈ భామ వ‌య‌సు 25. దాంతో హీరోయిన్ ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. అందుకే గ్లామ‌ర్ ఫీల్డ్ లో ఎదిగేందుకు అందాల ఆర‌బోత షురూ చేసింది సాషా. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలోనే న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. సాయికిర‌ణ్ అడ‌వి తెర‌కెక్కిస్తున్న ఆప‌రేష‌న్ గోల్డెన్ ఫిష్ లో హీరోయిన్ గా న‌టిస్తుంది సాషా. ఇప్పుడు ఈ చిత్ర ఫోటోస్ కూడా విడుద‌ల‌వుతున్నాయి. ఇవి చూసిన‌ త‌ర్వాత అమ్మో పాప‌లో చాలా విష‌యం ఉందే అనుకోకుండా ఉండ‌లేరు. ఎందుకంటే అంత‌గా క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో చంపేసింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ఎయిర్ టెల్ మాదిరే.. ఒక్క‌సారి సినిమాలో క‌నెక్ట్ అయితే ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఈ భామ‌కు క‌నెక్ట్ అయిపోతారేమో..?

Airtel Beauty Sasha Chettri Debut With Telugu Movie

More Related Stories