English   

అట్లీకుమార్ తో ఎన్టీఆర్.. ఫిక్సైపోవ‌చ్చా..? 

Atlee-Ashwini-dutt
2018-09-19 11:26:03

అట్లీకుమార్ అంటే ఇప్పుడు ద‌క్షిణాదిన తెలియ‌ని వాళ్లుండ‌రేమో..? సినిమాల‌తో కాస్త ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు ఈయ‌న సృష్టించిన సంచ‌ల‌నాలు క‌చ్చితంగా గుర్తుంటాయి. గ‌తేడాది మెర్స‌ల్ తో ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని త‌న‌వైపు తిప్పుకున్నాడు అట్లీకుమార్. మెడిక‌ల్ మాఫియాకు తోడు జిఎస్టీ ఇష్యూపై కూడా ప్ర‌శ్నించి ఔరా అనిపించాడు అట్లీకుమార్. దానికి ముందే తెరీ.. రాజారాణి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇచ్చాడు అట్లీ. ఇప్పుడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడి కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో తాను తెలుగులో సినిమా చేస్తున్నానంటూ ఆ మ‌ధ్య అనౌన్స్ చేసాడు అట్లీ. ఎన్టీఆర్ తోనే ఈయ‌న సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వినిపించాయి. 

కానీ ఇప్పుడు అట్లీ మాట మార్చేసాడు. ఇప్పుడు మ‌ళ్లీ తాను విజ‌య్ సినిమాతోనే బిజీ అయిపోయాడు. అయితే క‌చ్చితంగా తెలుగులో మాత్రం ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తాన‌ని చెబుతున్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో అశ్వినీద‌త్ సినిమా కూడా అనౌన్స్ చేసాడు. అట్లీకుమార్ ను తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసే బాధ్య‌త ఈయ‌నే తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమా ఉండ‌బోతుందని తెలుస్తుంది. ఎందుకంటే 2020లో జూనియ‌ర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ సీనియ‌ర్ నిర్మాత‌. అయితే అదెప్పుడు అనేది స్ప‌ష్టంగా మాత్రం చెప్ప‌ట్లేదు. ప్ర‌స్తుతం అట్లీ కూడా త‌న దృష్టి త‌మిళ ఇండ‌స్ట్రీపైనే పెట్టాడు. అంటే అట్లీ కుమార్ చూపులు తెలుగు ఇండ‌స్ట్రీపై ప‌డాలంటే మ‌రో ఏడాది అయినా ఆగాల్సిందే..! కానీ ఎప్పుడొచ్చిన అట్లీ సినిమా ఎన్టీఆర్ తోనే ఉంటుంద‌నేది మాత్రం వినిపిస్తున్న మాట‌. 

More Related Stories