English   

ఎన్టీఆర్ మోసపోయాడు.. థమన్ మారడా..?

Music Director SS Thaman Again Proved Copycat From Aravinda Sametha Peniviti Song
2018-09-19 21:27:28

కాపీక్యాట్.. ఈ ప‌దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం.. 90 కేజీల సాక్ష్యం.. మ‌న కుర్ర సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్. కింగ్ సినిమాలో ప‌క్క భాష‌ల్లో హిట్టైన ట్యూన్స్ ను దొబ్బేసి మ్యూజిక్ ఇస్తాడు బ్ర‌హ్మానందం. నిజంగా ఇండ‌స్ట్రీలో ఇలాంటివి చూసి చూసి విసుగొచ్చే శీనువైట్ల కింగ్ సినిమాలో ఈ కామెడీ పెట్టేసిన‌ట్లున్నాడు. మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎలాగూ పక్క ఇండ‌స్ట్రీల‌తో ప‌నిలేదు. అందుకే అక్క‌డ హిట్టైన పాట‌ల్నీ ఎం చ‌క్కా ఇక్క‌డ కాపీ కొట్టేస్తున్నారు. అప్పుడ‌ప్పుడూ త‌మ‌ పాట‌ల‌ను కూడా తానే కాపీ కొట్టేస్తుంటారు మ‌న మ్యూజిక్ డైరెక్ట‌ర్లు.

ఇప్పుడు థ‌మ‌న్ కూడా ఇదే చేస్తున్నాడు. తాజాగా అర‌వింద స‌మేతలో పెనివిటి పాట విడుద‌లైంది. ఈ పాట‌ను ఎక్క‌డో విన్న‌ట్లుందే అని విన‌గానే అనుమానాలు మొద‌ల‌య్యాయి. కాసేప‌టి త‌ర్వాత క్లారిటీ వ‌చ్చేసింది. ఈ పాట ఎక్క‌డో విన‌లేదు ఎప్పుడో థ‌మ‌న్ కొట్టిన వీర సినిమాలో పాట అది.. ర‌వితేజ, కాజ‌ల్ జంట‌గా వ‌చ్చిన ఓసి నా చిట్టి చిట్టి పాట ట్యూన్ ఇక్క‌డ వాడేసాడు థ‌మ‌న్. కాక‌పోతే దానికి కొద్దిగా ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చాడు అలాగే మ‌ధ్య‌లో బ్రూస్లీ కుంగ్ ఫూ కుమారి కూడా క‌నెక్ట్ అయింది.

థ‌మ‌న్ కాపీ అప్పుడప్పుడూ పీక్స్ కు చేరిపోతుంటుంది. ఆ మ‌ధ్య డిక్టేట‌ర్ లో గ‌ణేషా పాట‌ను సెల్ఫీ లేలే సాంగ్ లోంచి తీసుకున్నాడు. ఇక‌ శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తులో అను అను ఎక్క‌డో విన్న‌ట్లే ఉంటుంది. ఇక ఇందులో దేసీగాల్ సాంగ్.. ఆంజ‌నేయులు సినిమాలోని న‌న్నుంటుకోమాకే ఓ మ‌ర‌ద‌లా పాట‌కు కాపీ. ఆది చుట్టాల‌బ్బాయిలోని పాల‌మూరి పాల‌పిట్ట సాంగ్ హిందీలో స‌న్నీలియోన్ బేబీగాల్ కు కాపీ. థ‌మ‌న్ కాపీ కొట్ట‌డం ఇదే తొలిసారేం కాదు. బ్రూస్ లీ లోని కుంగ్ ఫూ కుమారి సాంగ్ ఫ‌టా పోస్ట‌ర్ నిక్ లా హీరోలోని ద‌టింగ్ నాచ్ అనే పాట‌కు కాపీ.

ఇక ఆగ‌డులోనూ భేల్ పూరీ సాంగ్ ట్యూన్స్ కూడా బ్రూస్ లీ పాట‌ల్లో వినిపిస్తాయి. బాద్షా డైమండ్ గాళ్ సాంగ్ ను కాస్త మార్చేసి బ్రూస్ లీలో రియా చేసేసాడు థ‌మ‌న్. ఏ సినిమా చూసిన ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం అన్న‌ట్లు.. థ‌మ‌న్ ప్ర‌తీ సినిమాలోనూ ఏదో ఓ పాట ప‌క్క భాష‌ల్లో హిట్టైన సాంగ్స్ ఉండ‌టం కామ‌నైపోయింది. ఆ మ‌ధ్య ప‌వ‌ర్ లో వ‌చ్చిన నాటంకీ రాంబో రాజ్ కుమార్ లోని సాడీ కే ఫాల్ సేకు కాపీ.. బ‌లుపుతో కాజ‌ల్ చెల్లివా.. బిజినెస్ మ్యాన్ లో పిల్లా చావ్.. కిక్ లో క‌న్నెత్తి చూడ‌కే.. ఇలా చెప్పుకుంటూ పోతే థ‌మ‌న్ కాపీ చిట్టా చాంతాడంత అవుతుంది. మొత్తానికి ఇప్ప‌టికైనా థ‌మ‌న్ త‌న బుర్ర‌కి ప‌నిచెప్పి కొత్త ట్యూన్స్ ఇస్తాడా.. లేదంటే వినేవాళ్లు వింటార్లే అని మ‌ళ్లీ అవే ఇచ్చేస్తాడా చూడాలి.

More Related Stories