English   

రాకేట్ స్పీడ్ లో ప‌వ‌న్ సినిమా షూటింగ్

Pawan Kalyan's Attarintiki Daredi Remade in Tamil With Simbu
2018-09-19 22:52:36

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో బిజీగా ఉంటే.. ఆయ‌న సినిమా షూటింగ్ రాకేట్ స్పీడ్ లో ఎలా జ‌రుగుతుంది..? అస‌లు ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా..? అస‌లు ఎలా ప‌వ‌న్ సినిమా ప‌ట్టాలెక్కింది అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈయ‌న న‌టించ‌క‌పోవ‌చ్చు కానీ ఆయ‌న సినిమాలు మాత్రం ప‌క్క భాష‌ల్లో ఇంకా ఉన్నాయి. ఈయ‌న ఐదేళ్ల కింద న‌టించిన అత్తారింటికి దారేది త‌మిళ్ లో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే క‌దా. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ మొద‌లైంది. శింబు ఇందులో హీరో. జార్జియాలో షూటింగ్ మొద‌లైంది. తొలి షెడ్యూల్ అక్క‌డే పూర్తి చేయ‌నున్నాడు ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సి. అత్తారింటికి దారేది అప్ప‌ట్లోనే 80 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.

Pawan Kalyan's Attarintiki Daredi Remade in Tamil With Simbu

ఆ వేడిలోనే విజ‌య్ హీరోగా అక్క‌డ రీమేక్ చేయాల‌నే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి. కానీ అప్పుడు ఆయ‌న దీనికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఈ చిత్ర రీమేక్ రైట్స్ తీసుకుంది. అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది కూడా. ఇందులో శింబు న‌టిస్తున్నాడు. ఈయ‌న లుక్ కూడా అభిమానుల‌కు పిచ్చెక్కిస్తుంది. ఇక అత్త పాత్ర‌లో ఖుష్బూ న‌టిస్తుంది. ఈమె సుంద‌ర్ భార్య కూడా. హీరోయిన్ గా మేఘాఆకాశ్ క‌న్ఫ‌ర్మ్ అయింది. మ‌రో హీరోయిన్ ఇంకా తేల‌లేదు. జార్జియాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసి.. చెన్నైలోనే మిగిలిన పార్ట్ షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు సుంద‌ర్. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి తెలుగులో ప‌వ‌న్ ఇమేజ్ తో అంత‌గా ఆడిన అత్తారింటికి దారేది.. అర‌వంలో ఏం మాయ చేయ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories