English   

ఏఎన్నార్ కు జూనియ‌ర్ ఎన్టీఆర్ గిఫ్ట్

Aravinda Sametha Audio Songs Releasing on Akkineni Nageshwar Rao Birthday
2018-09-20 07:53:36

అదేంటి.. ఇస్తే గిస్తే నాగేశ్వ‌ర‌రావ్ జ‌యంతికి అక్కినేని వాళ్లు ఇవ్వాలి కానీ నంద‌మూరి వార‌సుడు ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. ఎలాగూ త‌న బాధ్య‌తగా నాగార్జున కూడా సెప్టెంబ‌ర్ 20న దేవ‌దాస్ పాట‌ల వేడుక జ‌రుపుతున్నాడు. ఈ సినిమాలో నాని కూడా హీరోగా న‌టించాడు. ఇక అఖిల్ కూడా త‌న కొత్త సినిమాకు మిస్ట‌ర్ మ‌జ్ను అంటూ టైటిల్ పెట్టుకుని టీజ‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. డిసెంబ‌ర్ లో సినిమా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అక్కినేని హీరోకు బ‌హుమ‌తి ఇస్తున్నాడు.

అదేంటంటే.. జూనియ‌ర్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న అర‌వింద స‌మేత పాట‌ల విడుద‌ల సెప్టెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. అనుకోకుండా జ‌రిగిందో లేదంటే నిజంగానే నాగేశ్వ‌ర‌రావ్ కు బ‌హుమ‌తిగా ఉంటుంద‌ని ప్లాన్ చేసారో తెలియ‌దు కానీ ఇప్పుడు ఏఎన్నార్ బ‌ర్త్ డే రోజు ఎన్టీఆర్ పాట‌లు విడుద‌ల‌వుతున్నాయి. అక్కినేని, నంద‌మూరి కుటుంబాల మ‌ధ్య ఉన్న స‌త్సంబంధాల గురించి ఇంత‌కంటే ఏం చెబుతాం..? ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. అక్టోబ‌ర్ 10న అర‌వింద స‌మేత విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల్లో టైటిల్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు విడుద‌లైన పెనివిటి పాట‌కు మాత్రం ఊహించిన స్పంద‌న రావ‌డం లేదు. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

More Related Stories