English   

చిరంజీవి ఛ‌లో యూర‌ప్.. సైరా షూటింగ్ షురూ.. 

chiranjeevi
2018-09-20 12:58:46

నిన్న‌టి వ‌ర‌కు ఇండియాలోనే ఉన్న చిరంజీవి యూర‌ప్ చేరుకున్నారు. నేడో రేపో సైరా షెడ్యూల్ లో పాల్గొన‌బోతున్నారు. ఈయ‌న ఇప్పుడు యూర‌ప్ లోనే ఉన్నారు. అక్క‌డే అజ‌ర్ బైజాన్ లో జ‌రుగుతున్న చ‌ర‌ణ్ షూటింగ్ స్పాట్ కు వెళ్లాడు చిరు. త‌న‌యుడితో పాటు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను క‌లుసుకున్నారు. బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ 10 రోజులుగా అక్క‌డే జ‌రుగుతుంది. చ‌ర‌ణ్ తో పాటు చిత్ర‌యూనిట్ కూడా అక్క‌డే ఉంది. ఇప్పుడు చిరు రాక‌తో టీంలో తెలియ‌ని జోష్ క‌నిపిస్తుంది. అక్క‌డే ప‌క్క‌నే సైరా షూటింగ్ కూడా జ‌రుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ జార్జియాలో ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. అక్క‌డే 40 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ప‌ది రోజుల నుంచి షూటింగ్ జ‌రుగు తుంది. అయితే అందులో చిరంజీవి లేడు. ఇప్పుడు చిరు కూడా అడుగుపెట్టాడు. ఈయ‌న కూడా ఇప్పుడు క‌త్తి ప‌ట్టుకుని క‌ద‌న‌రంగంలోకి దూక‌బోతున్నాడు. మ‌రో నెల రోజుల పాటే అక్క‌డే ఉండ‌నున్నాడు మెగాస్టార్. మొత్తానికి చిరు కూడా యూర‌ప్ టూర్ వేస్తున్నాడ‌న్న‌మాట‌. సైరా కోసం వెళ్లి.. ప‌క్క‌నే ఉన్న చ‌ర‌ణ్ సినిమాను చూసొచ్చాడు అన్న‌య్య‌. 

More Related Stories