English   

‘అల్లుడు’ అదరగొడుతున్నాడుగా

Shailaja-Reddy-Alludu
2018-09-20 10:06:43

నాగచైతన్య, అనూ ఇమ్మానుయేల్ జంటగా వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాడు. ఫస్ట్ డే మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విషయంలో స్టడీగా ఉన్నాడు అల్లుడు. యస్.. ఫస్ట్ వీకెండ్ కు మాగ్జిమం వసూళ్లు రాబట్టాడంటే చిన్న విషయం కాదు. ఓవర్శీస్ లో కాస్త డల్ గా ఉన్న మన స్టేట్స్ లో మాస్ ను ఊపేస్తున్నాడు. చైతూ కెరీర్ లో హయ్యొస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన శైలజారెడ్డి అల్లుడు ఆ ఊపును కంటిన్యూ చేయడంలో విమర్శకులకూ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నిజంగా ఈ మూవీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. సినిమాకు రెగ్యులర్ గా ఉంది, కొత్తదనం లేదు అన్న టాక్ వచ్చినా.. తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద అత్తా అల్లుళ్ల కాన్సెప్ట్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అని మరోసారి ప్రూవ్ చేసిందీ అత్తా అల్లుళ్ల కథ.

మారుతి డైరెక్ట్ చేసిన శైలజారెడ్డి అతనిక్కూడా ఓ రకంగా షాక్ ఇచ్చింది. తనలో ఇంకా పస అయిపోతుందా అనే డౌట్ వచ్చేలా చేసింది. బట్ కలెక్షన్స్ వచ్చినంత మాత్రాన గొప్ప సినిమా అని అనలేం అన్నవారూ ఉన్నారు. ఇక శైలజారెడ్డిగా రమ్యకృష్ణ నటనకు ఫిదా కాని వారు లేరు. అలాగే ఎన్నాళ్లుగా ఓ హిట్ కోసం చూస్తోన్న అనూకు అల్లుడు హిట్ ఇచ్చాడు. మొత్తంగా ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి శైలజారెడ్డి అల్లుడు 32కోట్ల గ్రాస్ సాధించి దుమ్మురేపాడు. మామూలుగా ఈ సినిమాను 25కోట్లకు అమ్మారు. ఆ మొత్తం రావాలంటే మరో 8కోట్లైనా కలెక్ట్ చేయాలి. ఇప్పుడున్న ఊపు చూస్తోంటే అదేమంత కష్టం అనిపించడం లేదు. ఏదేమైనా అల్లుడు అదరగొడుతున్నాడు..

More Related Stories