English   

ఎన్టీఆర్ లో ఏఎన్నార్  వచ్చాడు 

Nageswar-Rao
2018-09-20 17:26:17

అవును.. ఎన్టీఆర్ లో ఏఎన్నార్ వ‌స్తున్నాడు. అది కూడా నాగేశ్వ‌ర‌రావ్ జ‌యంతి రోజే. సెప్టెంబ‌ర్ 20 ఉద‌యం 9.33 నిమిషాల‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్ లోని నాగేశ్వ‌ర‌రావ్ లుక్ విడుద‌ల చేసారు. ఈ విష‌యాన్ని ఆ పాత్ర పోషిస్తున్న సుమంత్ ట్వీట్ చేస్తు.. తాత పాత్ర‌లో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉందంటున్నాడు ‌. ఈ పాత్ర కోస‌మే నున్న‌గా మీసాలు కూడా తీసుకుని.. చాలా క్లీన్ గా క‌నిపిస్తున్నాడు ఈ అక్కినేని మేనల్లుడు. మ‌రీ ముఖ్యంగా తాత పోలిక‌లు ఈయ‌న‌లో చాలా ఉంటాయి. అందుకే క్రిష్ కూడా ఏరికోరి ఈయ‌న్నే తీసుకున్నాడు ఈ పాత్ర‌కు. ముందు నాగ‌చైత‌న్య‌ను అనుకున్నా కూడా ఎందుకో తెలియ‌దు కానీ త‌ర్వాత వెన‌క్కి త‌గ్గాడు క్రిష్. సుమంత్ అయితేనే ప‌ర్ ఫెక్ట్ గా స‌రిపోతాడు అని భావించి.. మ‌రో ఆలోచ‌న లేకుండా మ‌న‌వ‌న్నే తీసుకున్నాడు. 

ఎన్టీఆర్ జీవితంలో ఏఎన్నార్ పాత్ర కూడా కీల‌క‌మే. ముఖ్యంగా పెద్దాయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌న్న‌పుడు ఏఎన్నార్ వ‌ద్ద‌న్నారు.. మ‌న‌కెందుకు అండీ ఈ రాజ‌కీయాలు అంటూ వారించారు. త‌న‌ను ర‌మ్మంటే నో అనేసారు. అప్పుడే ఎన్టీఆర్, ఏఎన్నార్ మ‌ధ్య కాస్త వైరం కూడా వ‌చ్చింద‌నే వార్త‌లు ఉన్నాయి. ఇక సినిమాల ప‌రంగా ఇద్ద‌రూ క‌లిసి చాలా సినిమాలే చేసారు. ఇవ‌న్నీ ఈ బ‌యోపిక్ లో చూపించ‌బోతున్నాడు క్రిష్. ఇప్పుడు ఈ పాత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. అది కూడా ఏఎన్నార్ బ‌ర్త్ డే రోజే. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో త‌న పాత్ర షూటింగ్ కూడా మొద‌లుపెట్టాడు సుమంత్. ఈ మ‌ధ్యే ఫోటోలు కూడా పెట్టాడు ఈ హీరో. బాల‌య్య‌తో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉందంటున్నాడు సుమంత్. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది ఎన్టీఆర్ బ‌యోపిక్. అప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాపై అంచ‌నాలు అలా పెరిగిపోతూనే ఉంటాయి. మ‌రి చూడాలిక‌.. ఎన్టీఆర్ లో ఏఎన్నార్ ఎలా ఉండ‌బోతున్నాడో..? 

More Related Stories