English   

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకుల మీద షాకులు

NTR Fans disappoints with Aravinda Sametha Songs
2018-09-20 17:33:08

అవునా.. అంత‌గా ఏం క‌ష్టాలొచ్చాయో ఇప్పుడు అనుకుంటున్నారా..? ఇంకేం రావాలి.. రావాల్సిన‌వ‌న్నీ చాలానే వ‌చ్చాయి. కొత్త‌గా రావాల్సిన‌వి కూడా టార్గెట్ చేసి మ‌రీ వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఈ క‌న్ఫ్యూజ‌న్ ఏంటి.. వ‌చ్చిన‌వేంటో చెప్పొచ్చు క‌దా అనుకుంటున్నారా..? అక్క‌డికే వ‌స్తున్నాం.. ఇప్ప‌టికే హ‌రికృష్ణ మ‌ర‌ణంతో అర‌వింద స‌మేత ఆడియో వేడుక క్యాన్సిల్ అయిన సంగ‌తి తెలిసిందే క‌దా. ఇదే ఫ్యాన్స్ కు తొలిషాక్. పోనీలే తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత వేడుక చేసుకోవ‌డం ఎందుకు అని ఎన్టీఆర్ కూడా దూరంగా ఉన్నాడ‌ని అభిమానులు స‌ర్దుకున్నారు. ఆ త‌ర్వాత అర‌వింద స‌మేత సినిమాలో ఏ పాట‌లోనూ డాన్సులు లేవ‌ని మ‌రో షాక్ వ‌చ్చింది. అస‌లు ఎన్టీఆర్ అంటేనే డాన్సులు క‌దా.. అలాంటి త్రివిక్ర‌మ్ ఏంటి ఇలా చేసాడు అనుకున్నారు. పోనీలే ఏం చేస్తాం క‌థ‌లో భాగం అయ్యుంటుంది అని లైట్ తీసుకున్నారు.

ఇక ఇప్పుడు మ‌రో షాక్.. సినిమాలో ఏకంగా ఓ పాట‌నే లేపేసారు. టైమ్ లేద‌ని షూటింగ్ చేయ‌డం కూడా మానేసారు. అర‌వింద స‌మేత కేవ‌లం నాలుగు పాట‌ల‌తోనే వ‌స్తుంది. ఇందులో ఏడ పోయినాడో అనే పాట‌ను దారిచూడు దుమ్ముచూడు ఫేమ్ పంచెల్ దాస్ పాడాడు.. ఇక రెడ్డి ఇక్కడ సూడు పాటను  దలేర్ మెహేంది పాడగా, పెనివిటి సాంగ్ ను కాల భైరవ పాడాడు. ర‌వితేజ, కాజ‌ల్ జంట‌గా వ‌చ్చిన వీర సినిమాలోని ఓసి నా చిట్టి చిట్టి పాట ట్యూన్ ను పెనివిటి పాటకు వాడేసాడు థమన్. ఏడ పోయినాడో సాంగ్ కైలాష్ ఖేర్, పంచల్ దాస్, నిఖిత శ్రీవల్లి పాడారు. మొత్తానికి ఆడియో వేడుక లేదు.. డాన్సులు లేవు.. ఓ పాట లేదు.. ఇన్ని షాకుల మ‌ధ్య సినిమా వ‌స్తుంది. అయితే ఎన్ని షాకులు త‌గిలినా కూడా అక్టోబ‌ర్ 10న అర‌విందుడు రావ‌డం.. బాక్సాఫీస్ కుమ్మేయ‌డం మాత్రం ఖాయం అంటున్నాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. ఫ్యాన్స్ కూడా ఇదే ఆశిస్తున్నారు. మ‌రి ఎన్టీఆర్ ఏం చేస్తాడో చూడాలి..!

More Related Stories