English   

వైజ‌యంతి మూవీస్.. గోల్డెన్ డేస్ ఈజ్ బ్యాక్..

Vyjayanthi-Movies
2018-09-20 17:55:16

వై జ‌యంతి మూవీస్ కు మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చేసాయి. మ‌హాన‌టి పుణ్య‌మా అని వాళ్లు మ‌ళ్లీ నిల‌దొక్కుకున్నాడు అశ్వినీద‌త్. నిల‌బ‌డ‌టం ఏంటి.. లేచి 10 కే ర‌న్ చేస్తున్నారు ఈయ‌న ఇప్పుడు. వ‌ర‌స సినిమాల‌తో ర‌ప్ఫాడిస్తున్నాడు అశ్వినీద‌త్. మ‌హాన‌టితో వాళ్ల‌కు డ‌బ్బుల‌తో పాటు గౌర‌వం కూడా వ‌చ్చింది. హీరోలు.. హీరోయిన్లే కాదు.. ఇప్పుడు నిర్మాత‌లు కూడా రీ ఎంట్రీలు ఇస్తున్నారు. ఇండ‌స్ట్రీలో ఒక్క‌సారి న‌ష్ట‌పోతే ఇక ఆ నిర్మాత దివాళా తీసిన‌ట్లే అంటుంటారు. కానీ అశ్వినీదత్ మాత్రం అలా కాదు. త‌న‌కు కొన్ని లెక్క‌లున్నాయి. వాటి ప్ర‌కార‌మే ఇన్ని ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మ‌రోసారి త‌న స‌త్తా ఏంటో చూపించ‌డానికి వ‌స్తున్నాడు ఈ మెగా ప్రొడ్యూస‌ర్. అది కూడా సంచ‌ల‌న సినిమాల‌తో వ‌స్తున్నాడు. ఇండ‌స్ట్రీలో గ‌తం ఎప్పుడూ ఎవ‌రికీ గుర్తుండ‌దు. ఇక్క‌డ చ‌రిత్ర‌ల‌కు కాలం చెల్లిపోయింది. గ‌తంలో మేమింత చేసాం.. మేమంత చేసాం అంటే కుద‌ర‌దు. ఇప్పుడు నువ్వేంటి అనేది ఇక్క‌డ కావాలి. 

తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు అద్భుత‌మైన సినిమాలు చేసిన నిర్మాత‌ల్లో అశ్వినీద‌త్ ఒక‌రు. వై జ‌యంతి మూవీ బ్యాన‌ర్ పై ఇండ‌స్ట్రీ హిట్లు తీసాడు ఈ నిర్మాత‌. టాలీవుడ్ లోని టాప్ హీరోలంద‌రితోనూ సినిమాలు నిర్మించాడు అశ్వినీద‌త్. అయితే కొన్నేళ్ల కింద వ‌ర‌స‌గా ఫ్లాపులు త‌గ‌ల‌డంతో నిర్మాణానికి కాస్త బ్రేకిచ్చాడు ఈ నిర్మాత‌. ముఖ్యంగా శ‌క్తి సినిమాతో బాగా న‌ష్ట‌పోయిన అశ్వినీద‌త్.. ప్రొడ‌క్ష‌న్ కు దూరమ‌య్యారు. ఈ సినిమా వ‌చ్చి ఎనిమిదేళ్లు పూర్తైనా.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌లేదు అశ్వినీద‌త్. మ‌హాన‌టి వ‌చ్చినా అది పూర్తిగా ఆయ‌న కూతుళ్లే చూసుకున్నారు. ఇన్నేళ్ళ త‌ర్వాత అశ్వినీద‌త్ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నారు. ఈయ‌న వ‌ర‌స‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. 

ఇప్ప‌టికే నాని-నాగార్జున కాంబినేష‌న్ లో దేవ‌దాస్ సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. ఇక మ‌హేశ్ బాబుతో మ‌హ‌ర్షి సినిమా నిర్మిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి దీనికి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను దిల్ రాజు, పివిపితో క‌లిసి నిర్మిస్తున్నారు అశ్వినీద‌త్. ఈ నిర్మాత న‌ష్ట‌పోవ‌డంలో మ‌హేశ్ పాత్ర కూడా కొంత ఉంది. ఈయ‌న నిర్మించిన సైనికుడు డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మ‌రో మూడు సినిమాలు కూడా అనౌన్స్ చేసాడు ఈ నిర్మాత‌. చిరంజీవితో ఓ సినిమా.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రెండు సినిమాలు.. ఎన్టీఆర్ తో సినిమా ఒక‌టి త‌మ బ్యాన‌ర్ లో ఉంటాయ‌ని చెప్పాడు అశ్వినీద‌త్. ఈయ‌న దూకుడు చూస్తుంటే మ‌ళ్లీ పూర్తిగా సంచ‌ల‌నాలకు సిద్ధ‌మైన‌ట్లే క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. మెగా ప్రొడ్యూస‌ర్ మెగా రిట‌ర్న్స్ ఎలా ఉండ‌బోతున్నాయో...  

More Related Stories