English   

న‌న్ను దోచుకుందువ‌టే ఎలా ఉంది గురూ..?

Sudheer Babu Nannu Dochukunduvate Overseas Premiers Talk
2018-09-21 08:22:11

సుధీర్ బాబు తొలి సినిమా చేసిన‌పుడు ఎవ‌రో కృష్ణ అల్లుడు అంట అన్నారు.. ఆ త‌ర్వాత ప్రేమ‌క‌థాచిత్రం హిట్ అయిన త‌ర్వాత కూడా మ‌హేష్ బావ అంట అన్నారు. అందుకే ఇప్ప‌టికీ సుధీర్ బాబు త‌న సొంత గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నాడు. ఈయ‌న సినిమా సినిమాకు త‌న స్థాయిని పెంచుకుంటున్నాడు. సుధీర్ గ‌త రెండు సినిమాలు ప్రేక్ష‌కుల మెప్పు పొందుతూ వ‌స్తున్నాయి. శ‌మంత‌క‌మ‌ణితో పర్లేద‌నిపించిన ఈ హీరో.. మొన్న స‌మ్మోహ‌నం అంటూ వ‌చ్చాడు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ఈ రెండు సినిమాల‌తో ఇండియాలోనే కాదు.. ఓవ‌ర్సీస్ లో కూడా ఈయ‌న‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు ఇదే మార్కెట్ న‌న్ను దోచుకుందువటేపై క‌నిపిస్తుంది.

ఈ సినిమా సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. విడుద‌ల కూడా భారీగానే అవుతుంది. ఈ సినిమా ఓవ‌ర్సీస్ రైట్స్ కోటి 10 ల‌క్ష‌ల‌కు కొన్నారు. సెప్టెంబ‌ర్ 20 రాత్రే 106 లొకేష‌న్స్ లో ప్రీమియ‌ర్ షోస్ ప‌డుతున్నాయి. ఇది సుధీర్ బాబు రేంజ్ కు చాలా ఎక్కువ‌. సుధీర్ బాబు నిర్మాత‌గా మారి చేసిన సినిమా ఇది. ఆర్ఎస్ నాయుడు అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఈ సినిమా చేసాడు సుధీర్. ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా క‌చ్చితంగా ఆక‌ట్టుకునేలాగే క‌నిపిస్తుంది. పైగా ఇది సాఫ్ట్ వేర్ క‌థ‌. నిర్మాత కూడా త‌నే కావ‌డంతో ప్ర‌మోష‌న్ కూడా బాగా గ‌ట్టిగా చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఓ ప్ర‌మోష‌నల్ వీడియో కూడా విడుద‌ల చేసి.. సినిమాపై హైప్ పెంచేసాడు ఈ హీరో. ఇండియాలో 400 స్క్రీన్స్ లో విడుద‌ల కానుంది న‌న్ను దోచుకుందువ‌టే. మ‌రి చూడాలిక‌.. ఓవ‌ర్సీస్ తో పాటు ఇక్క‌డ కూడా సుధీర్ చేయ‌బోయే మాయ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories