English   

ప‌వ‌న్ నెల్లూరు టూర్ షెడ్యూల్

Pawan Kalyan's Nellore Political Tour Schedule
2018-09-21 09:16:21

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సినిమాల‌తో రుణం తీరిపోయి చాలా కాల‌మైంది. అజ్ఞాతవాసి త‌ర్వాత ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్లారు. సినిమాలు త‌న ఒంటికి ప‌డ‌వ‌ని ఫిక్సైపోయారు. మ‌ళ్లీ ఎప్పుడు సినిమాల్లో న‌టిస్తాడో తెలియ‌దు కానీ ఇప్పుడైతే ఇక ప‌వ‌ర్ స్టార్ నుంచి సినిమాలు ఊహించ‌డం క‌ష్ట‌మే. పూర్తిగా రాజ‌కీయ తీర్థం పుచ్చుకున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్పుడు రాజ‌కీయాల‌తోనే బిజీగా ఉన్నాడు ఈయ‌న‌. 2019 ఎల‌క్ష‌న్స్ లో ప‌వ‌న్ పోటీ చేయ‌డానికి ఫిక్సైపోయాడు. దానికి ఇంకా ఎనిమిది నెల‌లే టైమే ఉండ‌టంతో ఇక‌పై సినిమాలు పూర్తిగా వ‌దిలేస్తున్న‌ట్లు క్లారిటీ ఇచ్చాడు ప‌వ‌ర్ స్టార్. ఎన్నిక‌ల‌కు వ్యూహ ర‌చ‌న‌లు ఇప్ప‌ట్నుంచే మొదలు పెట్టాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు నెల్లూరు ప‌ర్య‌ట‌నకు వెళ్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

సెప్టెంబ‌ర్ 22 నుంచి ఈయ‌న నెల్లూరు యాత్ర మొద‌లుకానుంది. అక్క‌డే రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో దిగ‌నున్నారు. ఇక అదే రోజు రాత్రి నెల్లూరులో బ‌స చేస్తారు ప‌వ‌ర్ స్టార్. సెప్టెంబ‌ర్ 23 ఉద‌యం శ్రీ బారసాహిద్ బాబా దర్గా కి పవన్ కళ్యాణ్  సినీ నటుడు ఆలీ తో కలసి వెళ్ళ‌నున్నారు. ఆ త‌ర్వాత అక్క‌డి ప్ర‌జ‌ల క‌ష్టాల గురించి అడిగి తెలుసుకోనున్నారు ప‌వ‌ర్ స్టార్. ఇక సెప్టెంబ‌ర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి ప్రజారాపోరాట యాత్ర మలి విడత మొద‌లు కానుంది. ఇప్ప‌ట్నుంచి ప్ర‌తీరోజు ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని చూసుకుంటున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

పాద‌యాత్రకు కూడా ప‌వ‌న్ ప్లాన్ చేస్తున్నాడ‌నే వార్త‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే చాలామంది రాజ‌కీయ నాయ‌కులు పాద యాత్ర చేసారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. చంద్ర‌బాబు లాంటి వాళ్ల‌కి ఈ పాద‌యాత్ర ఏకంగా సిఎం సీట్ తీసుకొచ్చింది. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నాడు. ప‌క్కవాళ్లు వ‌ద్ద‌ని వారిస్తున్నా.. ఇబ్బందులు వ‌స్తాయ‌ని చెబుతున్నాడు వినే మూడ్ లో ప‌వ‌న్ లేన‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఈయ‌న ఇప్పుడు పూర్తిగా రాజ‌కీయాల‌పై దృష్టి సారించారు. మ‌రి చూడాలి.. ఈయ‌న దూకుడు ఎలా ఉండ‌బోతుందో రాబోయే కాలంలో..!

More Related Stories