English   

ఈ ద‌స‌రా.. ఆ ముగ్గురి స‌ర‌దా తీర్చేస్తుందిగా..

Vijay-devarakonda
2018-09-21 10:09:29

ద‌స‌రా సీజ‌న్ వ‌చ్చిదంటే హీరోల‌కు రెక్క‌లొస్తాయి. ఎందుకంటే ప‌ది రోజులు సెల‌వులు వ‌స్తాయి క‌దా అందుకు. ఈ సారి కూడా ఇదే జ‌రుగుతుంది. ఈ ద‌స‌రాకు మూడు భారీ సినిమాలు వ‌స్తున్నాయి. ముందు నుంచి పోటీలో ఉన్న సినిమాలు రెండే అయినా కూడా ఒక‌టి లేట్ ఎంట్రీ.. కానీ లేటెస్ట్ ఎంట్రీ. విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. రామ్.. విశాల్ లాంటి ముగ్గురు క్రేజీ హీరోలు ఒకేరోజు త‌మ సినిమాల‌తో ముందుకొస్తున్నారు. ఇది డేంజ‌ర్ అని తెలిసినా కూడా ఎవ‌రికీ ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. గ‌తేడాది ఒకేరోజు వ‌చ్చి ఇలాగే నితిన్, బెల్లంకొండ‌, రానా ముగ్గురు న‌ష్ట‌పోయారు. ఇప్పుడు ఇదే త‌ప్పు వీళ్లు కూడా చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ నోటా అక్టోబ‌ర్ 4న విడుద‌ల కావాల్సింది కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఆల‌స్యం వ‌ల్ల ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేస్తున్నారు. పూర్తిస్థాయి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా నోటా వ‌స్తుంది. ఆనంద్ శంక‌ర్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కిస్తున్నాడు. 

విజ‌య్ ఈ సినిమాతోనే త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్తున్నాడు. ఇందులో ముఖ్య‌మంత్రిగా న‌టించాడు ఈ కుర్ర హీరో. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్తైపోయింది. అక్టోబ‌ర్ 18న ద‌స‌రా కానుగ‌కా ఇప్ప‌టికే తాము వ‌స్తున్నామ‌ని ముందు చెప్పారు రామ్, విశాల్. విశాల్ పందెంకోడి 2 అంటుంటే.. రామ్ హ‌లో గురు ప్రేమ‌కోస‌మే అంటున్నాడు. కానీ అవేం ప‌ట్టించుకోకుండా అదే రోజు విజ‌య్ కూడా వ‌స్తున్నాడిప్పుడు. దిల్ రాజు ఇప్ప‌టికే రంగంలోకి దిగి విజ‌య్ సినిమాను వాయిదా వేయించే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఎందుకంటే విజ‌య్ వ‌చ్చాడంటే క‌చ్చితంగా మిగిలిన సినిమాల‌కు న‌ష్టం త‌ప్ప‌దు. అయినా ఉన్న‌ట్లుండి ఇలా తేదీలు మార్చుకుంటే ఇత‌ర హీరోల‌కు.. సినిమాల‌కు ఎంత ఇబ్బంది అవుతుందో..? అది ఆలోచించ‌కుండా విజ‌య్ వ‌చ్చేస్తున్నాడు. మొత్తానికి ఈ ద‌స‌రా వార్ వీళ్ల స‌ర‌దా తీర్చేస్తుంది. 

More Related Stories