English   

విజయ్ దేవరకొండ పోలింగ్ పెట్టాడు..!!  

vijay-devarakonda
2018-09-21 20:34:57

లేటెస్ట్ టాలీవుడ్ సెన్షేషన్ విజయ్ దేవరకొండ ఏం చేసినా సంచలనమే అవుతోందిపుడు. రీసెంట్ గా సద్గురు జగ్గీవాసుదేవ్ ను కూడా కలిసొచ్చిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘నోటా’ మూవీ రిలీజ్ డేట్ కోసం ఆడియన్స్ ను అడుగుతున్నాడు. గీత గోవిందంతో సెంచరీ కొట్టిన విజయ్ దేవరకొండ ఈ మూవీతో తమిళ్ లోనూ తెరంగేట్రం చేస్తున్నాడు. నోటా బై లింగ్వుల్ మూవీ. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదలవుతోంది. విశేషం ఏంటంటే.. నోటా తమిళ్ వెర్షన్ కోసం కూడా విజయ్ నే డబ్బింగ్ చెప్పబోతున్నాడు. ఇందుకోసం మూవీ స్టార్ట్ అయిన టైమ్ లోనే ట్యూటర్ ను పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో నిన్నటి వరకూ చాలామందికి డౌట్స్ ఉండేవి. ఆ డౌట్స్ ఇప్పుడు ఈ మూవీ టీమ్ కు కూడా వచ్చినట్టున్నాయి. అందుకే ఏకంగా విజయ్ దేవరకొండనే ఓ ట్వీట్ చేశాడు. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 5న వస్తుందనుకున్నారు. కానీ విజయ్ ఆ డేట్ ను కూడా మెన్షన్ చేస్తూ కొత్త ఫజిల్ వదిలాడు.

అంటే నన్ను మీరు ఏ డేట్ లో చూడాలనుకుంటున్నారో మీరే చెప్పండి అంటూ అక్టోబర్ 5, అక్టోబర్ 10, అక్టోబర్ 18 డేట్స్ ఇచ్చాడు. అంటే ఈ ఆప్షన్స్ లో నన్ను ఎప్పుడు చూడాలనుకుంటున్నారు అని నేరుగా అభిమానుల్ని లేదా ప్రేక్షకుల్నే అడిగాడన్నమాట. మరి జనం ఏం చెబుతారో కానీ.. వీటిలో అక్టోబర్ 10 అంటే ఆ నెక్ట్స్ డే ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ ఉంటుంది. అప్పుడు వస్తే మాత్రం వార్ మంచి రసకందాయంలో ఉంటుంది. 

ఇక అక్టోబర్ 18న దసరా.. ఆ రోజు రామ్, అనుపమా పరమేశ్వరన్ ల సినిమా ‘హలోగురూ ప్రేమకోసమే’ ఉంది. విజయ్ వస్తే ఈ మూవీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే అదే డేట్ లో తమిళ్ లో విడుదల చేయడం కష్టం. చేసినా ప్రాబ్లమ్స్ ఉంటాయ్.. ఇక మిగిలింది. అక్టోబర్ 5. ఈ రోజు వస్తే పండగ జోష్ ఈ సినిమాకు రాదు. ఈ కన్ఫ్యూజన్ లోనే ఆడియన్ పోల్ పెట్టినట్టున్నాడు విజయ్. అతనికి ఫ్యాన్స్ తెలుగులోనే ఉన్నారు కాబట్టి మాగ్జిమం.. అక్టోబర్ 18 అనొచ్చు. ఏదేమైనా విజయ్ దేవరకొండ డేట్ ప్రాబ్లమ్ ఉంది. ఏదేమైనా తెలుగు, తమిళ్ రెండూ వర్కవుట్ కావాలంటే అక్టోబర్ 5 మాత్రమే సేఫ్ డేట్. మరి వీళ్లు ఏ డేట్ లో వస్తారో చూద్దాం.

More Related Stories