English   

అరవింద సమేత స్టోరీ లీక్..ఇదేనా?

NTR-Aravinda-Sametha
2018-09-21 15:00:07

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ అరవింద సమేత వీరరాఘవ. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ శుక్రవారం మిగిలిన రెండు పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లింది. ఆ రెండు పాటలూ చిత్రీకరిస్తే.. ఈ సినిమా ప్రొడక్షన్ పని పూర్తవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. హారిక హాసిని బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా వచ్చిన ఆడియో సాంగ్స్ మాత్రం అస్సలు ఆకట్టుకునేలా లేవు. తమన్ నుంచి ఆశించినంత గొప్ప అవుట్ పుట్ అయితే రాలేదు. పైగా ఇంత పెద్ద సినిమాకు వచ్చిన పాటలు కూడా కాపీ అనే కమెంట్స్ వస్తుండటం ఈ సినిమాకు ఫస్ట్ మైనస్ గా మారితే.. లేటెస్ట్ గా ఈ మూవీ కథ ఇదే అంటూ ఓ న్యూస్ రౌండ్స్ అవుతోంది. ఆ కథ ‘‘దమ్ము’’ సినిమా కథకు కాస్త దగ్గరగా ఉండటంతో ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ లో కొత్త డౌట్స్ మొదలయ్యాయి. 

ప్రస్తుతం వినిపిస్తోన్న అరవింద సమేత వీరరాఘవ కథ ఎలా ఉందో తెలుసా.. ‘‘ఆయనో వీర ఫ్యాక్షనిస్ట్. పెళ్లి చేసుకున్న తర్వాత అతను భార్యను వదిలేసి ఊరు కోసం బయలుదేరతాడు. ఆ క్రమంలో ఆయన అవతలి పక్షాలకు పెద్ద టార్గెట్ గా మారతాడు. దీంతో పుట్టిన బిడ్డను ఆ వాతావరణానికి దూరంగా సిటీలో ఉంచి పెంచుతుంది ఆ బిడ్డ నాయనమ్మ. అటు తన కోసం వెళ్లిన భర్త కోసం ఆ భార్య ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటుంది. అటు సిటీలోనే పెరిగిన కుర్రాడు పెద్దయ్యాక అక్కడి లైఫ్ కే అలవాటు పడతాడు. అక్కడే అరవిందతో ప్రేమలోనూ పడతాడు. ఈ టైమ్ లో తన తల్లి చనిపోయిన వార్త తెలుస్తుంది. అసలు తల్లి ఎలా ఉంటుందో తెలియదని ఆ కుర్రాడికి ఈ వార్త ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని కలిగిస్తుంది. తను ఊరికి వస్తాడు. అంటే రాయలసీమ. అక్కడికి వచ్చాక తనకు నాయనమ్మ చెప్పిన కథ ద్వారా తెలిసేదేమంటే.. తన తండ్రిని ఎవరో చంపేశారని. పైగా బాబాయ్ తో పాటు బంధువులు కూడా ఈ విషయం చెబుతారు. దీంతో తండ్రిని చంపి.. ఇన్ డైరెక్ట్ గా తల్లి చావుకూ కారణమైన వారిపై పగ తీర్చుకుంటాడు. ఇక్కడే అతనికి మరదలు(ఈషారెబ్బా)తో కొంత ఎమోషనల్ డ్రామా కూడా నడుస్తుంది’’. ఇదీ అరవింద సమేత వీరరాఘవ కథ అంటూ చక్కర్లు కొడుతోన్న కథ.

ఇది నిజమా కాదా అనేది పక్కన బెడితే దమ్ము కథకు చాలా దగ్గరగా లేదు. పిల్లాడ్ని చంపేస్తారని సిటీలో ఉంచి అనాథలా పెంచుతారు దమ్ములో. తెలియకుండా తెచ్చిన ఫైనల్ గా వారసుడుగా ప్రకటిస్తే అతను రివెంజ్ మొదలుపెడతాడు. పైగా ఇందులోనూ సిటీలోనూ, ఊర్లోనూ ఇద్దరు హీరోయిన్లుంటారు. మొత్తంగా త్రివిక్రమ్ ఇలాంటి కాపీ కథలకు తనదైన డైలాగ్ పూతలు పూస్తాడు. ఆ మాటల మాయలో పడేసి ఆడియన్స్ కు ఇది పాత కథే అన్న విషయం గుర్తుకు రాకుండా చేస్తాడు. అదే ఈ సారి కూడా చేస్తున్నట్టు అర్థమౌతోంది అంటున్నారు. ఒకవేళ కథ ఇదే అయినా దీనికి దగ్గరగా ఉన్నా ఖచ్చితంగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ అనుకున్న రేంజ్ కు మాత్రం వెళ్లదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 

More Related Stories