English   

వైసిపిలోకి నాగార్జున‌.. అక్కినేని రాజ‌కీయాలు షురూ.. 

Nagarjuna-jagan
2018-09-22 12:21:48

అస‌లు ఇది విన‌డానికే చాలా విచిత్రంగా ఉంది. నంద‌మూరి ఫ్యామిలీకి రాజ‌కీయాలంటే ఓకే గానీ అక్కినేని కుటుంబానికి పాలిటిక్స్ అంటే పెద్ద‌గా ప‌డ‌వు. అస‌లు అన్నేళ్ల‌లో ఏనాడూ ఏఎన్నార్ రాజ‌కీయాల వైపు అడుగేయ‌లేదు. వేసేవాళ్ల‌ను వ‌ద్ద‌ని వారించాడు కూడా. అలాంటిది ఇప్పుడు నాగార్జున రాజ‌కీయాల్లోకి రానున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అది కూడా జ‌గ‌న్ పార్టీలో చేర‌బోతున్నార‌ని తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 24న‌.. జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా నాగార్జున వైసిపిలో చేరుతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుంది. నాగార్జున‌కు ముందు నుంచి కూడా రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటే చాలా అభిమానం. ఆయ‌న ఉన్న‌పుడు కూడా చాలా స‌న్నిహితంగా ఉండేవాడు నాగార్జున‌. పైగా ఈయ‌న ప‌క్కా బిజినెస్ మ్యాన్. సినిమాల‌తో పాటు అత‌డికి చాలా వ్యాపారాలున్నాయి. సాధార‌ణంగా బిజినెస్ ఉన్నోళ్లు రాజకీయాల్లోకి రావడం కామన్. ఎందుకంటే రాజకీయాలు కూడా పెద్ద వ్యాపారం కాబట్టి.  పైగా నాగార్జున గత లోక్ సభ ఎన్నికల్లోనే బిజెపి తరపున అమలకు విజయవాడ లోక్ సభ సీటు కోసం ట్రై చేసారనే వార్త‌లు అప్ప‌ట్లో వినిపించాయి. అహ్మదాబాద్ వెళ్లి నరేంద్రమోదీ ని కూడా కలిసారు. 

ఈ లెక్క‌న నాగార్జున‌కు రాజ‌కీయాలంటే బాగానే ఆస‌క్తి క‌నిపిస్తుంది. అయితే తన‌కు తానుగా ఎప్పుడూ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్ప‌లేదు నాగ్.  ఇక నాగార్జున రాజకీయాల్లోకి రావాలంటే తనముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి టిడిపి.. రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్. తెలుగుదేశంలో ఎంత వ‌ర‌కు నాగ్ జాయిన్ అవుతాడ‌నేది ఆస‌క్తిక‌ర‌మే. పైగా బాల‌య్య‌తో అత‌డికి విభేధాలున్నాయ‌ని వార్త‌లున్నాయి. అందుకే నాగార్జున వైకాపా వైపు అడుగేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ లోక్ సభకి పోటీ చేయాలనుకోవడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. తెదేపా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రమంతా ఓడిపోయినా ఈ రెండు లోక్ సభ స్థానాలు గెల‌వ‌డం ఖాయం. ఎందుకంటే అక్కడే కొత్త  రాజధాని నిర్మిస్తున్నాడు చంద్ర‌బాబు. పైగా కులసమీకరణాల ప్రకారం ఈ రెండు నియోజకవర్గాలు తెదేపా కి బలమైనవి. కాబట్టి నాగార్జున వైకాపా లో చేరినా కూడా అస‌లు పోటీ చేస్తారా లేదా అనేది కూడా ఆస‌క్తిక‌ర‌మే. ఇవ‌న్నీ ఎంత‌గా స‌హ‌క‌రిస్తున్నా.. నాగార్జున మాత్రం రాజ‌కీయాల వైపు వెళ్తాడా అనే అనుమానం కూడా అంతే బ‌లంగా ఉంది.

More Related Stories