మణిరత్నం.. మరో రొటీన్ స్టోరీ

ఆధిపత్యం.. దీనికోసా సాగే పోరాటమే ఏ సినిమా కథకైనా.. ఏ చరిత్రకైనా పునాది. యస్.. విలన్ పై హీరో పై చేయి సాధించడమే అంతిమంగా ఆడియన్స్ చూసేది. కొన్ని సార్లు పాట్రన్ మారొచ్చు కానీ.. ప్రాసెస్ మాత్రం అదే ఉంటుంది. ఇక ఇలాంటి అప్పర్ హ్యాండ్ వార్ మూవీస్ చేయడంలో ఎక్స్ పర్ట్ అయిన మణిరత్నం మరో్సారి అలాంటి ప్రయత్నమే చేసిన సినిమా నవాబ్. తమిళంలో చెక్కచివంత వానమ్ గా వస్తోన్న ఈ మూవీ తెలుగులో నవాబ్ గా వస్తోంది. కొన్నాళ్ల క్రితం విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. కానీ లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా కథను పూర్తిగా చెప్పేసింది. ఊరికి డాన్ లాంటి మనిషి ఉంటాడు. అతనికి ముగ్గురు కొడుకులు. మరి అలాంటి పర్సనాలిటీ చస్తే.. తర్వాత ఆ సీట్ లో ఎవరు కూర్చోవాలన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ ఈప్రశ్నకు ఆన్సర్ గా ఆ ముగ్గురు కొడుకుల మధ్యే గొడవలు పెట్టాడు మణిరత్నం. ఊరికి గ్యాంగ్ స్టర్ లాంటి భూపతిరాజా (ప్రకాష్ రాజ్)పోతే అతని తనయులు ఆయన సీట్ కోసం ఎలా కొట్లాడుకున్నారనేదే ఈ నవాబ్ కథ. ఇందుకోసం ఒక్కో కొడుక్కి ఒక్కో నేపథ్యం పెట్టి.. వారి మనస్తత్వాలతో ఓ కథను తయారు చేసుకున్నాడు మణి. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ రెండో్ ట్రైలర్ సినిమాకు మైనస్ గానే మారుతుందనుకో్చ్చు. ఇక ఈ నెల 27న దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల కాబోతోన్న నవాబ్ బాక్సాఫీస్ వద్ద సుల్తాన్ లా నిలుస్తాడా లేదా అనేది చూడాలి.