English   

స్టార్ హీరోలలో మార్పు సహజం

Telugu Star Heroes Changed Route from Mass to Class
2018-09-22 22:17:21

నిన్న‌టి వ‌ర‌కూ మాస్ మంత్రం  జ‌పించిన వారు కూడా క్లాస్ గా క‌నిపించాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. ఇది నిజం. మ‌హేష్ బాబు నుంచి ప్ర‌భాస్ వ‌రకూ ఇప్పుడు క్లాస్ మంత్రం జపిస్తున్నారు., ఇందుకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నుంచి రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ వ‌రకూ మిన‌హాయింపు కాదు. ఒక‌వేళ నిజ‌మే అనుకుందాం. కానీ ఈ మార్పు ఇంత స‌డెన్ గా ఎందుకు..? ఈ ప్ర‌శ్న స‌హ‌జంగానే వ‌స్తుంది. కానీ ఈ స‌హ‌జ‌మైన ప్ర‌శ్న‌కూ వీళ్ల దగ్గ‌ర స‌హ‌జ‌మైన ఆన్స‌రే ఉంది. అవును. ఒక‌ప్పుడు మాస్ ను మెప్పిస్తే చాలు.. మాస్ హీరోలైపోవ‌చ్చు అనే అపోహ ప్ర‌తి హీరోలోనూ ఉండేది. అందుకు త‌గ్గ‌ట్టుగానే  ఆయా సినిమాలు మాస్ కు న‌చ్చితేనే బాక్సాఫీస్ వ‌ద్ద నిలబడతాయి. కానీ గ‌త కొన్నాళ్లుగా ఇండ‌స్ట్రీలో మార్పులు మొద‌ల‌య్యాయి.

ఆడియ‌న్స్ టేస్ట్ కు అనుగుణంగానే సినిమాలు వ‌స్తాయ‌నేది నిజం.వారి టేస్ట్ లో మార్పులు వ‌చ్చిన‌ప్పుడు ఎంత  పెద్ద స్టార్ అయినా మార‌క‌త‌ప్ప‌దు. ఇలాంటి  త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లోనే ఉన్నారు మ‌న స్టార్స్ ఇప్పుడు. అందుకే మాస్ తో పాటు కాకుండా ఇప్పుడు క్లాస్ ను మెప్పించి మాస్ ను ఆక‌ట్టుకునేలా చూసుకుంటున్నారు. అందుకే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 25వ  సినిమా మహర్షి లో కూడా మాగ్జిమం క్లాస్ లుక్ లోనే క‌నిపించ‌బోతున్నాడు. వంశీ పైడిప‌ల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ వ‌చ్చే యేడాది ఏప్రిల్ లో విడుద‌ల కాబోతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించిన దానికి భిన్నంగా క్లాస్ గా క‌నిపిస్తాడ‌ట మహేష్ బాబు. కాస్త మాస్ ను మెప్పించే అంశాలున్నా.. మాగ్జిమం క్లాస్ కోస‌మే ఈ సినిమా అన్న‌ట్టుగా క‌నిపిస్తుంద‌నే టాక్ ఉంది.

ఇక మాస్ కు కేరాఫ్ అంటే ఒక‌ప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాలు. కానీ  ఇప్పుడు సిట్యుయేష‌న్ మారింది. నాన్న‌కు ప్రేమ‌తో నుంచి మాస్ కంటే ముందు క్లాస్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు యంగ్ టైగ‌ర్. అలాగే మాస్ కూ  న‌చ్చే అంశాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా రాబోతోన్న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ పూర్తిగా క్లాస్ లుక్ లోనే క‌నిపిస్తాడ‌ని టాక్. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆడియో సాంగ్స్ కూడా ఉండ‌టంతో ఇది నిజ‌మే అంటోంది  టాలీవుడ్. ఇంకా  చెబితే స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఉంటుందీ సినిమా.

ఇక మాస్ డైరెక్ట‌ర్ అంటే ఒక‌ప్పుడు వివి వినాయ‌క్.. ఇప్పుడు బోయ‌పాటి శ్రీను. అలాంటి బోయ‌పాటి కూడా రామ్ చ‌ర‌ణ్ కోసం క్లాస్ గా మారాల్సి వ‌చ్చింది. అంతా అనుకుంటున్న‌ట్టు ఇది బోయ‌పాటి మార్క్  సినిమా కాదు. మారిన రామ్ చ‌ర‌ణ్ టేస్ట్ కు అనుగుణంగా క్లాస్ గా రూపొందుతోన్న సినిమా. అంటే బోయపాటి నుంచి ఎక్స్ పెక్ట్ చేసే అంశాలు ఎంత త‌క్కువ ఊహించుకుంంటే అంత మంచిద‌న్న‌మాట‌. అలాగ‌ని క్లాస్ గా వీళ్లు డిజ‌ప్పాయింట్ చేస్తార‌నుకోవ‌డానికీ లేదు.

బాహుబ‌లి త‌ర్వాత సాహోతో స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ చేస్తోన్న ప్ర‌భాస్ కూడా మాస్ పై ఇంట్రెస్ట్ త‌గ్గించుకున్నాడు. అందుకు ఏ 80ల నాటి ప్రేమ‌క‌థ అంటూ ఓ క్లాస్ స్టోరీతో వ‌స్తున్నాడు. రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీతో మ‌రోసారి త‌న‌లోని క్లాస్ డార్లింగ్ ను బ‌య‌ట‌కు తీసుకురాబోతున్నాడు ప్రభాస్. మొత్తంగా మ‌న స్టార్ హీరోల‌కు క్లాస్ దోమ కుట్టింది. అందుకు కార‌ణం.. ఇప్పుడు ఆ సినిమాల‌కే ఎక్కువ ఆద‌ర‌ణ ఉండ‌టం. రూర‌ల్ ఆడియ‌న్స్ త‌గ్గిపోయి.. అర్బన్ ఆడియ‌న్స్ పెర‌గ‌డం కూడా ఇందుకు ఓ కార‌ణంగా చెప్పొచ్చు. మ‌రి ఈ మాస్ హీరోల క్లాస్ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

More Related Stories