English   

అక్కినేని భార్యాభ‌ర్త‌ల్లో గెలుపెవ‌రిది

Naga Chaitanya's Shailaja Reddy Alludu Samantha's U Turn Movies Box Office Collections
2018-09-23 07:00:47

ఇప్పుడు అంద‌రిలోనూ వ‌స్తున్న అనుమానం కూడా ఇదే. సినిమాలు వ‌చ్చి ఎలాగూ వారం రోజులు దాటాయి కాబ‌ట్టి ఖచ్చితంగా సినిమాల ప‌రిస్థితి కూడా తెలిసే ఉంటుంది క‌దా. అందుకే ఇప్పుడు అంతా అడుగుతున్నారు భార్యాభ‌ర్త‌ల్లో విజ‌యం ఎవ‌రిది అని..? భార్యాభ‌ర్త‌ల పోరులో ఎవ‌రు గెలుస్తారు అని తెలుసుకోడానికి చాలా రోజుల నుంచి అభిమానులు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఈ పోరు ముగిసింది. తొలిరోజు స‌మ‌రంలో భ‌ర్తే గెలిచాడు. టాక్ తో ప‌నిలేకుండా శైల‌జారెడ్డి అల్లుడు తొలిరోజు వ‌సూళ్ళు ఓ రేంజ్ లో కుమ్మేసాడు. ఏకంగా 7 కోట్ల షేర్.. 12 కోట్ల గ్రాస్ తో ర‌చ్చ ర‌చ్చ చేసాడు. అదే స‌మ‌యంలో స‌మంత యూ ట‌ర్న్ మాత్రం చాలా త‌క్కువ‌గా వ‌సూళ్లు రాబ‌ట్టింది. తొలిరోజు ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కలిపి కేవలం కోటి 20 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.

టాక్ అద్భుతంగా వ‌చ్చినా కూడా ఎందుకో తెలియ‌దు కానీ ఈ సినిమా వైపు ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. అవ‌త‌ల టాక్ బాగోలేక పోయినా కూడా స్టార్ ప‌వ‌ర్ ఉంది కాబ‌ట్టి అంతా అల్లుడిపైనే ప‌డ్డారు. అయితే వారం రోజుల త‌ర్వాత సీన్ రివ‌ర్స్ అయిపోయింది. 8 రోజుల్లో శైల‌జా రెడ్డి అల్లుడు 17 కోట్ల షేర్ తీసుకొచ్చాడు.. అయితే ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే రావాల్సింది 24 కోట్లు. ఇప్పుడు వ‌చ్చేలా లేవు కాబ‌ట్టి ఇది ఫ్లాపే. మ‌రోవైపు స‌మంత యూ ట‌ర్న్ సైతం టాక్ బాగున్నా క‌లెక్ష‌న్ల విష‌యంలో వెన‌క‌బ‌డింది ఈ చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 5 కోట్ల షేర్ మాత్ర‌మే తీసుకొచ్చింది ఈ చిత్రం. దాంతో భార్యాభ‌ర్త‌ల పోరులో ఎవ‌రు విజ‌యం సాధించ‌లేదు. చైతూ మ‌రోసారి ఫ్లాప్ సినిమా ఇస్తే.. స‌మంత మాత్రం గౌర‌వ ప్ర‌దమైన ఫ్లాప్ ఇచ్చింది.

More Related Stories