English   

అఖిల్ కూడా ఆ పని చేసాడు

Akhil Akkineni Made 8 Pack Body For Mr.Majnu
2018-09-23 17:02:02

అఖిల్ కూడా సిక్స్ ప్యాక్ జాబితాలో చేరిపోయాడు. ఈయ‌న కూడా ఫిజిక్ తో పిచ్చెక్కించాడు. బాలీవుడ్ హీరోల‌కు కూడా షాక్ ఇచ్చేలా ర‌ప్ఫాడించేసాడు అక్కినేని వార‌సుడు. ప్రేమ‌క‌థ కోస‌మే అయినా కూడా ఎందుకో తెలియ‌దు కానీ బాడీ పెంచేసాడు అఖిల్. హీరో అంటే మినిమ‌మ్ సిక్స్ ప్యాక్ ఉండాల‌ని ఫిక్సైపోయాడో ఏమో కానీ కొత్త లుక్ లో కిరాక్ పుట్టించాడు అఖిల్. ఇప్పుడు ఈయ‌న 8 ప్యాక్ లుక్ బ‌య‌టికి వ‌చ్చింది. అఖిల్ స్వ‌యంగా జిమ్ చేస్తూ ఈ పిక్ సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసాడు. ఇది చూసిన త‌ర్వాత మ‌నోడి క‌ష్టాన్ని చూసి అద‌ర‌హో అనుకోకుండా ఉండ‌లేరు. ప్ర‌స్తుతం ఈయ‌న మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలో న‌టిస్తున్నాడు. వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో పూర్తిగా ప్లే బాయ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు అఖిల్. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్. ఇది ప్రేమ‌క‌థ‌. దీనికైతే సిక్స్ ప్యాక్ తో ప‌నిలేదు. మ‌రి ఈ చిత్రం త‌ర్వాత యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఏదైనా చేస్తున్నాడేమో అఖిల్ కే తెలియాలి మ‌రి.

Akhil Akkineni Made 8 Pack Body For Mr.Majnu

More Related Stories