English   

గాసిప్ లకు చెక్ పెట్టిన నాగార్జున

Nagarjuna Clarified on his Political Entry
2018-09-23 21:01:53

నాగార్జున రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాయ‌నే వార్త‌లే ఈ మ‌ధ్య కాలంలో చాలా కామెడీగా అనిపించాయి. ఎవ‌రైనా రాజ‌కీయాల్లోకి వ‌స్తారేమో కానీ నాగ్ మాత్రం అస్స‌లు రాడ‌ని అత‌డి అభిమానులు కూడా అనుకున్నారు. ఎందుకంటే అక్కినేని కుటుంబం రాజ‌కీయాల‌కు అంత దూరం మ‌రి..! అలాంటిది నాగార్జున రాజ‌కీయాల‌పై ఆస‌క్తిగా ఉన్నాడంటూ ఈ మ‌ధ్య చాలా క‌థ‌నాలు వ‌చ్చాయి. వైసిపిలో జాయిన్ అవుతున్నాడ‌ని.. జ‌గ‌న్ ను కూడా క‌లిసి మాట్లాడాడ‌నే టాక్ కూడా వ‌చ్చింది. పాద‌యాత్ర‌లోనే వెళ్లి నాగార్జున వైసిపి కండువా క‌ప్పుకుంటాడ‌నే ప్ర‌చారం కూడా గ‌ట్టిగానే జ‌రిగింది. అయితే ఇవ‌న్నీ అక్కినేని వార‌సుడి వ‌ర‌కు వెళ్లాయి. ఇవ‌న్నీ అబ‌ద్ధం అని కొట్టిపారేసాడు నాగార్జున‌. అస‌లు రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఏ రోజు కూడా అనుకోలేద‌ని.. త‌ను జీవితంలో అటువైపు ఆలోచించ‌న‌ని చెబుతున్నాడు మ‌న్మ‌థుడు. ఇవ‌న్నీ మీడియా సృష్టించిన వార్త‌లే అంటూ కొట్టేసాడు నాగ్. ఒక‌వేళ నిజంగా తాను రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటే ఖచ్చితంగా మీడియాకు చెబుతాడు అంటున్నాడు నాగార్జున‌. ఈయ‌నే స్వ‌యంగా చెప్ప‌డంతో నాగార్జున రాజ‌కీయ అరంగేట్రంపై తెర ప‌డిపోయిన‌ట్లే..!

More Related Stories