English   

అద్దీ మ‌రి.. స‌ల్మాన్-క‌త్రినా క్రేజ్ అంటే..!

Swag-Se-Swagat
2018-09-24 17:41:05

బాలీవుడ్ లో ఎంత మంది క‌పుల్ అయినా ఉండ‌నీ.. స‌ల్మాన్ ఖాన్-క‌త్రినా కైఫ్ అంటే ఏదో తెలియ‌ని ఆస‌క్తి. ఈ ఇద్ద‌రి మ‌ధ్య పెళ్లి వ‌ర‌కు వెళ్లొచ్చిన బంధం ఉంది. ఆ వెంట‌నే చిలిపి గొడ‌వ‌లు.. సీరియ‌స్ యుద్ధాలు కూడా జ‌రిగాయి. అయితే ఏం జ‌రిగినా వీళ్లు తెర‌పై క‌నిపించారంటే మాత్రం అదోర‌కం ర‌చ్చ‌. ఈ క్రేజ్ మాట‌ల్లో చెప్ప‌డానికి వీలు లేదు. ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన టైగ‌ర్ జిందా హై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు ఇందులో స్వాగ్ సే క‌రేగే పాట యూ ట్యూబ్ లో స‌రికొత్త చ‌రిత్ర‌కు తెర‌తీసింది. ఈ పాట‌ను ఏకంగా 600 మిలియ‌న్ మంది.. అంటే 60 కోట్ల మంది చూసారు. ఓ పాట‌ను ఇంత‌గా చూడ‌టం ఇండియన్ సినిమాలో ఇదే తొలిసారి.

టైగ‌ర్ జిందా హై విడుద‌లై 8 నెల‌లు గ‌డిచినా ఇప్ప‌టికీ ఈ పాట‌కు క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. అందులో బీట్ కు తోడు క‌త్రినా-స‌ల్మాన్ కెమిస్ట్రీ కూడా అలాగే ఉంటుంది. పైగా ఇప్పుడు స‌ల్మాన్ కూడా త‌న‌ మాజీ ప్రేయ‌సి క‌త్రినా కైఫ్ కు చేరువ‌వుతున్నాడు. ఆమె లేక నేను లేను అంటున్నాడు ఈ హీరో. తాజాగా భ‌ర‌త్ సినిమా నుంచి ప్రియాంక చోప్రా త‌ప్పుకోగానే మ‌రో ఆలోచ‌న లేకుండా క‌త్రినాను తీసుకొచ్చాడు. ఎందుకంటే స‌ల్మాన్, క‌త్రినా సూప‌ర్ హిట్ జోడీ. పైగా అలీ అబ్బాస్ తెర‌కెక్కించిన టైగ‌ర్ జిందా హైలో కూడా ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. దాంతో ఈ జోడీనే మ‌ళ్లీ రిపీట్ చేయాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు. మొత్తానికి కార‌ణం ఏదైనా స‌ల్మాన్-క‌త్రినా క‌లిసారంటే మాత్రం రికార్డులు బ‌ద్ద‌లైపోవాల్సిందే. 

More Related Stories