English   

ప్రభాస్ అంటే పడిచస్తానంటోంది..

Swara-Bhaskar
2018-09-24 17:49:25

బాలీవుడ్ లో కంగనా రనౌత్ తర్వాత కాంట్రవర్శీయల్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ స్వర భాస్కర్. తన బోల్డ్ బిహేవియర్ తో తను చాలామందికి నచ్చుతుంది కూడా. రీసెంట్ గా ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాతో ఆకట్టుకున్న స్వర భాస్కర్.. సోషల్ మీడియాలో వేసే ప్రశ్నలు చేసే పనులకూ చాలామంది అభిమానులున్నారు. ఏది ఉన్నా ‘ట్విట్టర్ బద్ధలు కొట్టినట్టు’ చెప్పడం తన స్టైల్. తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అట. అతనంటే పిచ్చి అంటోంది. ఈ పిచ్చి ఎప్పుడు పట్టుకుందో తెలుసా.. బాహుబలితో. యస్.. ప్రభాస్ పై ఉన్న అభిమానం వల్లే బాహుబలి, బాహుబలి-2 సినిమాలను అరడజనుసార్లకు పైగా చూశానంటోంది. 

ఇక పనిలో పనిగా తన నేపథ్యాన్ని కూడా చెప్పిందీ బ్యూటీ. వాళ్ల నాన్నది వైజాగేనట. పేరు చిత్రపు ఉదయ్ భాస్కర్. వైజాగ్ నేవీలో పనిచేశేవాడట. తనకు తెలుగులో శివ, చంటి వంటి సినిమాలు బాగా ఇష్టమట. ఇకపై తెలుగులో ఎవరైనా అవకాశాలిస్తే ఖచ్చితంగా నటిస్తానంటోంది. కాకపోతే స్క్రిప్ట్ నచ్చాలట. మొత్తంగా తెలుగు మూలాలున్న ఈ భామ బాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే. కానీ ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మరి ‘ఎలాంటి’ పాత్రైనా చేయగల టాలెంట్ ఉన్న స్వరను తెలుగుకు ఎవరైనా తీసుకువస్తారా అనేది చూడాలి. 

More Related Stories