English   

ప‌ర్లేదు.. ర‌కుల్ బాగానే సంపాదించుకుంది.. 

Rakul-Preet-Singh
2018-09-24 11:19:40

అవును మ‌రి.. ఎందుకు సంపాదించ‌దు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నపుడు క‌చ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది క‌దా అనుకుంటున్నారా..? అయితే ఇక్క‌డ మ‌నం సంపాదించింది అనేది డ‌బ్బుల గురించి కాదు.. అభిమానం గురించి. ఈమెకు అభిమానం కూడా బాగానే ఉంది. అది బ‌య‌టికి చూపించ‌లేనిది కానీ.. సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ బ‌ట్టి ఆమె క్రేజ్ ఏంటో తెలుస్తుంది అంద‌రికీ. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది ఈ భామ‌. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని అభిమానుల‌తో షేర్ చేసుకుంటుంది. ఇదే ర‌కుల్ కు అక్క‌డ అభిమానం పెరిగిపోయేలా చేస్తుంది. పైగా అందాల ఆర‌బోత ద‌గ్గ‌ర కూడా అస్స‌లు మొహ‌మాట‌ప‌డ‌దు. మ్యాగ్జిమమ్ అందాల‌న్నీ చూపిస్తుంటుంది. 

ఇక ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈమె ఫాలోయ‌ర్స్ సంఖ్య 50 ల‌క్ష‌ల‌కు చేరిపోయారు. దాంతో అభిమానుల‌కు థ్యాంక్స్ చెప్పింది ర‌కుల్. ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నిజంగా రుణ‌ప‌డిపోయాను అంటూ ఎమోష‌న‌ల్ గా హార్ట్ సింబ‌ల్ పెట్టేసింది ఈ భామ‌. తెలుగులో ర‌కుల్ హ‌వా త‌గ్గిపోయి చాలా కాల‌మైంది. ఇక్క‌డంతా ఇప్పుడు కొత్త భామ‌ల హ‌ల్ చ‌ల్ న‌డుస్తుంది. ఈ పోటీ త‌ట్టుకోడానికే అమ్మ‌డు ఫుల్లుగా ఎక్స్ పోజింగ్ కూడా చేస్తుంది. ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌ర కాకుండా మిగిలిన భాష‌ల్లో వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది రకుల్. త‌మిళ‌నాట కార్తితో ఓ సినిమా.. విశాల్ తో ఓ సినిమా.. సూర్య‌తో సెల్వ రాఘ‌వ‌న్ ఎన్ జికే.. హిందీలో అజ‌య్ దేవ్ గ‌న్ సినిమా.. ఇలా చాలానే చేస్తుంది ఇప్పుడు. ఇక తెలుగులో నాగ‌చైత‌న్య‌-బాబీ-వెంక‌టేశ్ కాంబినేష‌న్ లో రానున్న వెంకీ మామ‌లో న‌టిస్తుంది. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు హాట్ ఫోటోషూట్ల‌తో బాగానే క‌వ్విస్తుంది ఈ భామ‌.

More Related Stories