ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ బంపర్ ఆఫర్..

పాపం ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆడియో వేడుక లేదు.. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. సీన్స్ కూడా లీక్ అవుతున్నాయి.. అన్నింటికి మించి పైగా బజ్ కూడా ఊహించనంత లేకపోవడంతో అరవింద సమేత టీంకు ఏం పాలు పోవట్లేదు. త్రివిక్రమ్ కూడా ఈ సినిమా గురించి చాలా ఆలోచిస్తున్నాడు. దసరా సందర్భంగా సెలవుల్లో వస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది. మిగిలిన పాట చిత్రీకరణ కూడా మరో వారం రోజుల్లో పూర్తి చేయనున్నాడు మాటల మాంత్రికుడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో 4 పాటలే ఉన్నాయని.. ఐదో పాటకు టైమ్ లేక ఆపేసారని వార్తలు వచ్చాయి. ముందు ఇలాగే అనుకున్నా కూడా ఇప్పుడు ఐదో పాటను కూడా సినిమాలో జోడించాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. టైమ్ ఇంకా ఉండటంతో త్రివిక్రమ్ కూడా సరే అన్నాడు. ఈ పాట చిత్రీకరణ విదేశాల్లో జరగనుంది. పూజాహెగ్డే ఈ పాటలో ఫుల్ గ్లామర్ షోతో చంపేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి నాలుగు పాటలే ఉన్నాయి.. ఎన్టీఆర్ డాన్సులు మిస్ అయిపోతున్నాం అనుకునే వాళ్లకు ఐదో పాట కచ్చితంగా బంపర్ ఆఫరే. లేదు అనిపించి.. ఆ తర్వాత ఉంది అని అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నాడు ఎన్టీఆర్. మరి ఆ ఐదో పాట ఎలా ఉండబోతుందో..? థమన్ కనీసం ఈ పాటకైనా ఫ్రెష్ ట్యూన్ ఇస్తాడో లేదో..?