English   

దేవ‌దాస్.. ల‌క్ష్యం బాగా పెద్ద‌ది బాసూ..!

Devadas
2018-09-25 10:45:10

ఈ మ‌ధ్య చాలా పెద్ద సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డానికి.. యావ‌రేజ్ గా మిగిలిపోవ‌డానికి కార‌ణాలు టాక్ బాగా లేక‌పోవ‌డం కాదు.. బిజినెస్ ఎక్కువ‌గా జ‌ర‌గ‌డం. అందుకే చాలా సినిమాలు మంచి వ‌సూళ్లు తీసుకొచ్చినా కూడా యావ‌రేజ్ లుగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు దేవ‌దాస్ కు కూడా భారీ బిజినెస్ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాగార్జున‌, నాని కెరీర్ లో ఎప్పుడూ ఇంత బిజినెస్ జ‌ర‌గ‌లేదు. తొలిసారి ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు కాబ‌ట్టి ఆ మాత్రం అంచ‌నాలు ఉంటాయి. ఇప్పుడు ఇదే బిజినెస్ లో కూడా క‌నిపించింది. ఈ సినిమాను 38 కోట్ల‌కు అమ్మారు. అంటే 40 కోట్లు వ‌స్తే కానీ సినిమా హిట్ అనిపించుకోదు అన్న‌మాట‌. తెలంగాణలో అయితే ఏకంగా 11 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఓవ‌ర్సీస్ లో 4.50 కోట్లకు అమ్మారు.  మిగిలిన ఏరియాల్లో కూడా మంచి రేట్ కు అమ్ముడైపోయింది దేవ‌దాస్. నాగార్జున‌, నాని లాంటి క్రేజీ హీరోలు ఉండ‌టంతో క‌చ్చితంగా సినిమాకి ఇది పెద్ద ల‌క్ష్యమేం కాదంటున్నారు అభిమానులు. కానీ ఒక్క వారంలోనే ఈ సినిమా ఎంత మాయ‌చేసినా కూడా.. ఎందుకంటే అక్టోబ‌ర్ 5న నోటా విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే ఎలా ఉంటుందో ర‌చ్చ చెప్పాల్సిన ప‌నిలేదు. దానికి కానీ పాజిటివ్ టాక్ వ‌చ్చిందంటే దేవ‌దాస్ ప‌రిస్థితి ఎటు వెళ్తుందో చెప్ప‌లేం. అందుకే ఏం చేసినా నాగార్జున‌, నాని వారంలోనే చేయాలి. ఒక్క వారంలో దాదాపు 35 కోట్ల షేర్ తీసుకొస్తే కానీ ఈ సినిమా సేఫ్ అవ్వడం క‌ష్టం. అది కూడా మంచి టాక్ తో ఓపెన్ అయితే కానీ ఇవ‌న్నీ జ‌ర‌గ‌వు. మ‌రి చూడాలిక‌.. సెప్టెంబ‌ర్ 27న వ‌స్తున్న దేవ‌దాస్ ఎంతవ‌ర‌కు మాయ చేస్తారో..?

More Related Stories