English   

రామ్ చ‌ర‌ణ్ స్టేట్ రౌడీ అవుతున్నాడా..? 

Ram-Charan
2018-09-25 11:27:59

చిరంజీవి సినిమాలు వాడుకోవ‌డం.. ఆయ‌న సినిమా క‌థ‌లు తీసుకోవ‌డం.. ఆయ‌న పాట‌లు రీమిక్స్ చేయ‌డం ఇప్పుడు మెగా హీరోల‌కు అల‌వాటు అయిపోయింది. ఎలాగూ మెగాస్టార్ మ‌నుషుల‌మే క‌దా అని అంతా ఆయ‌న్ని వాడేస్తున్నారు. అలాంటిది త‌న‌యుడు మాత్రం వాడ‌కుండా ఎలా ఉంటాడు చెప్పండి..? అందుకే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా మ‌రోసారి తండ్రిని వాడుకుంటున్నాడు. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టిస్తున్న సినిమాకు స్టేట్ రౌడీ అనే టైటిల్ పెడుతున్నార‌ని తెలుస్తుంది. ఈ విష‌య‌మై చిరంజీవి కూడా సై అనేసాడ‌ని.. క‌థ కూడా టైటిల్ కు సూట్ అయ్యేలా ఉంటుంద‌ని తెలుస్తుంది. అందుకే మ‌రో ఆలోచ‌న లేకుండా చిరు టైటిల్ ను త‌న‌యుడు వాడేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ అజ‌ర్ బైజాన్ లో జ‌రుగుతుంది. మెగాస్టార్ కూడా మొన్న వెళ్లి కొడుకును చూసొచ్చాడు. ప్ర‌స్తుతం ఫైట్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు రామ్ చ‌ర‌ణ్. ఈ సినిమాలో ప‌క్కా మాస్ రోల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు మెగా వార‌సుడు. స్టేట్ రౌడీ అంటే కేరాఫ్ చిరంజీవి. అప్ప‌ట్లో ఈ సినిమా ఫ‌లితంతో ప‌నిలేకుండా ఊపేసింది. ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ త‌న‌యుడు ఆ టైటిల్ వాడుకుండుంటంతో అంచ‌నాలు అలా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తండ్రి టైటిల్స్ జోలికి వెళ్ల‌కుండా కేవ‌లం పాట‌లు మాత్ర‌మే రీమిక్స్ చేసాడు చ‌ర‌ణ్. ఇప్పుడు టైటిల్ కూడా వాడేసుకుంటున్నాడు. మ‌రి చూడాలిక‌.. తండ్రి టైటిల్ తో బాక్సాఫీస్ ను ఎంత‌వ‌ర‌కు కొల్ల‌గొడ‌తాడో..? స‌ంక్రాంతికి విడుద‌ల కానుంది ఈ చిత్రం. కైరా అద్వాని హీరోయిన్. 

More Related Stories