English   

గ్రేట్ సింగర్ భర్త మరణించాడు

Vani-Jayaram
2018-09-25 13:12:05

అలనాటి నేపథ్య గాయని.. గ్రేట్ సింగర్.. నేషనల్ అవార్డ్ విన్నర్ వాణి జయరామ్ భర్త మరణించారు. వాణి జయరామ్ లోని జయరామ్ ఆయనే. నిజానికి ఆమె అసలు పేరు కలైవాణి. అయితే పెళ్లి తర్వాత తన భర్త పేరును తన పేరులో చేర్చుకున్నారు. ఆ తర్వాతే వాణికి సింగర్ గా స్టార్డమ్ వచ్చిందని చెబుతారు. అందుకు కారణం.. ఆమె భర్తను ఆమెను సింగర్ గా ఎంకరేజ్ చేయడమే. తెలుగుతో పాటు దక్షిణాదిలోన్ని అన్ని భాషల్లో పాడారు వాణి జయరామ్. హిందీలోనూ కొన్ని పాటలు ఆలపించారు. మొత్తంగా తన తరం గాయనీమణులతో పోలిస్తే సంఖ్యాపరంగా కాస్త తక్కువ సినిమాల్లోనే పాడినా.. వాసిలో తనవి ది బెస్ట్ సాంగ్స్.. కెరీర్ లో బెస్ట్ సింగర్ గా మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు వాణి జయరామ్. వీటిలో రెండు సినిమాలు తెలుగువే కావడం విశేషం. మొత్తంగా తను భర్తతో కలిసి చెన్నైలోని వేలూరులో స్థిరపడ్డారు. కొన్నాళ్లుగా జయరామ్ అస్వస్థతకు గురై ఉన్నారు. ఈ సోమవారం మరణించారు. ఆయన మృతి పట్ల తమిళ చిత్రపరిశ్రమ వాణి జయరామ్ కు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. 

More Related Stories