English   

అవుటాఫ్ త్రివిక్రమ్ స్టైల్.. అగెయిన్ ఎన్టీఆర్ స్టైల్.. 

Aravindha-Sametha
2018-09-25 18:39:58

ఒక ఎమోషన్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లే సత్తా పాటకు ఉంటుంది. అది ఎలాంటి ఎమోషన్ అయినా.. ఆ పాట దాన్ని క్యారీ చేస్తుంది. అదే పాటకు ఉండే పవర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న అరవింద సమేత వీరరాఘవ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన పాటలు ఒకెత్తు.. ఇవాళ వచ్చిన లిరికల్ సాంగ్ ఒకెత్తు అని అర్థమౌతోంది. ఓ మరణం వేళ వచ్చే పాటగా చెబుతోన్న ఈ పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం ‘రం రుధిరం సమరం మరణం గెలవం ఎవరం’ అంటూ ఒకరకమైన మూడ్ ను క్రియేట్ చేస్తే దానికి రాయలసీమ మాండలికపు సొగసులను అద్దడంతో పాటు మరణించిన వేళ అక్కడి సంస్కృతిని ఇనుమడింప చేసే పదాలతో పెంచలదాస్ ప్రాణం పెట్టి రాశాడు.. పాడాడు అన్నట్టుగా ఉందీ పాట. 

ఎమోషన్స్ ను పండించడంలో ఎన్టీఆర్ నటన పీక్స్ లో ఉంటుందని అందరికీ తెలుసు. ఇక ఇలాంటి పాట పడితే అతని నటన ఏ స్థాయిలో ఉంటుందో.. ఊహించుకోవచ్చు. ఒక రకంగా వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయీ పాటకు. ఇక చూస్తుంటే.. యస్.. ఖచ్చితంగా ఈ పాట సినిమాలో గేమ్ ఛేంజర్ అనుకోవచ్చు. అలాగే అరవింద సమేత వీరరాఘవుడిని ఆదుకునే పాట కూడా ఇదే కావొచ్చు. ఇప్పటికే లీక్ అయిన కొన్ని సీన్స్ ను బట్టి మరణించబోయే నాగబాబు అని అర్థమౌతోంది. అతని మరణం వేళ వచ్చే పాటగా.. ఈ పాట తర్వాత రుధిరాన్ని చిందింపజేసే వీరరాఘవుడిగా ఎన్టీఆర్ నటనను ఊహించుకునేలా ఉన్న ఈ పాట ఆల్బమ్ సంగతి పక్కన బెడితే సినిమాలో హైలెట్ గా నిలబోతోందని చెప్పొచ్చు.

నిజమే.. ఇది అవుటాఫ్ త్రివిక్రమ్ స్టైల్.. అగెయిన్ ఎన్టీఆర్ స్టైల్.. యస్.. ఎన్టీఆర్ ను ఇంత ఊరమాస్ గా చూసి చాలా రోజులైంది. మరోసారి కత్తి పట్టాడు. మరి ఈ శైలిని త్రివిక్రమ్ ఏ శైలిలో రూపొందించాడో కానీ.. ఖచ్చితంగా ఈ పాట తర్వాత ఈ సినిమాపై ఉన్న ‘కొన్ని’ అనుమానాలు పోతాయి. మొత్తంగా ఈ పాటతో అంచనాలు భారీగా పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. 

More Related Stories