English   

త్రివిక్రమ్ నే భయపెట్టిన పూజా హెగ్డే.. 

Pooja-Hegde
2018-09-25 19:34:10

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అని ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సోలోగా పాడుకుంటున్నాడట. అవును.. తానెంతో కష్టపడి చేసిన ఓ పనిని పూజా హెగ్డే దారుణంగా చెడగొట్టిందని టాక్. ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. సినిమా బాగా రాలేదనీ.. త్రివిక్రమ్ మార్క్ అస్సలేం లేదనీ.. పాటలు పూర్తి మైనస్ గా మారాయని.. తమన్ సంగీతం బిగ్గెస్ట్ మైనస్ అనీ.. ఇలా రకరకాలుగా నెగెటివ్ వార్తలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తానెంతో ఇష్టపడి, కష్టపడి చేయాలనుకున్న ప్రయోగం పూజా హెగ్డే రూపంలో తుస్సుమందట. దీంతో త్రివిక్రమ్ తో పాటు ఎన్టీఆర్ అండ్ ఎంటైర్ టీమ్ షాక్ తిందట.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. గత కొన్ని సినిమాలుగా త్రివిక్రమ్ తన హీరోయిన్లతో తెలుగులోనే మాట్లాడిస్తున్నాడు. యస్.. వారు వేరే భాష వారు అయినా సరే తెలుగులో వారి పాత్రకు వారితోనే డబ్బింగ్ చెప్పిస్తున్నాడు. అ.. ఆ లో అనుపమతో మాట్లాడించిన మాటలు బాగా పేలాయి. తర్వాత అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ ఇద్దరితోనూ పలికించిన మాటలు పట్టించుకునేలోపే సినిమా పోయింది. అయినా ఇప్పుడు అరవింద సమేతలో పూజాహెగ్డేతోనూ డైలాగ్స్ చెప్పించాడు. ఆ మధ్య ఓ పాటలో తను చెప్పిన డైలాగ్ బావుంది. కానీ ఓవరాల్ గా డబ్బింగ్ చూశాక త్రివిక్రమ్ కూడా జడుసుకున్నాడట. తన తెలుగు ఇలా కిల్ అయిపోతుందని ఏ మాత్రం ఊహించని అతను.. పూజా డబ్బింగ్ కు డంగయ్యాడని టాక్. ఇదే డైలాగ్స్ చూసిన ఎన్టీఆర్ కూడా షాక్ అయ్యాడట. అంటే షూటింగ్ లో ఏదో కవర్ చేసినా డబ్బింగ్ లో పర్ఫెక్ట్ గా చెప్పించొచ్చు అనుకున్నారట. కానీ మరి ఆ డబ్బింగ్ ఇంఛార్జ్ ఎవరో కానీ.. అమ్మడిని అలా వదిలేసినట్టున్నాడు. 

నిజానికి పూజా హెగ్డే తెలుగు, బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ టైమ్ లో తనతో లీజర్ గా డబ్బింగ్ చెప్పించడం కష్టం. అయినా ట్రై చేశారు. కానీ తన హర్రీస్ తనకు ఉంటాయి కదా. ఆ హడావిడీలోనే ఇలా గందరగోళంగా డబ్బింగ్ చెప్పి ఉండొచ్చు అంటున్నారు. ఏదేమైనా త్రివిక్రమ్ ను తన డబ్బింగ్ పూజా భయపెట్టిందనే అంటున్నారు. మరి తను రంగంలోకి దిగి కరెక్ట్ చేస్తాడా లేక.. టైమ్ తక్కువగా ఉంది కాబట్టి.. వేరే వారితో డబ్బింగ్ చెప్పిస్తాడా అనేది చూడాలి. 

More Related Stories