English   

అర‌వింద స‌మేత‌లో డాన్సులున్నాయా?

NTR Busy With Song Shoot of Aravinda Sametha
2018-09-26 06:50:04

ఫ్యాన్స్ లో ఇన్ని రోజులు ఇదే అనుమానం ఉంది. త్రివిక్ర‌మ్ సినిమా కాబ‌ట్టి అర‌వింద స‌మేత‌లో డైలాగుల‌కు కొద‌వ ఉండ‌దు. ఎన్టీఆర్ ఉన్నాడు కాబ‌ట్టి యాక్ష‌న్ సీక్వెన్సుల‌కు కూడా కొద‌వ లేదు. కానీ డాన్సులు మాత్రం లేవ‌నేది చాలా రోజులుగా వినిపిస్తున్న వార్త‌లు. ఇప్పుడు వాటికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ డాన్స్ మాస్ట‌ర్ జానీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో అదిరిపోయే డాన్సులు ఉన్నాయంటూ క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చాడు ఈయ‌న‌. ఎందుకంటే జానీ మాస్ట‌ర్ పాట‌లు అంటే ఫుల్ మాస్ స్టెప్పులే గుర్తొస్తాయి. ఆయ‌న చేసిన పాట‌లు కూడా అలాగే ఉంటాయి మ‌రి. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం అర‌వింద స‌మేత‌లో ఓ పాట కంపోజ్ చేసాడు ఈ కొరియోగ్రాఫ‌ర్.

NTR Busy With Song Shoot of Aravinda Sametha

తాజాగా ఈ పాట చిత్రీక‌ర‌ణ కూడా పూర్తైంది. త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్ తో తాను దిగిన ఫోటో ట్వీట్ చేస్తూ చాలా రోజుల త‌ర్వాత త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్ గారితో ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. పాట ఔట్ పుట్ అద్బుతంగా వ‌చ్చింది.. అర‌వింద స‌మేత కోసం వేచి చూస్తున్నా అంటూ ట్వీట్ చేసాడు. ఇది చూసిన త‌ర్వాత ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ప‌ర్లేదు ఒక్కొక్క‌టిగా లేవు అనుకున్న‌వ‌న్నీ వ‌చ్చి సినిమాలో యాడ్ అవుతున్నాయి. ముందు నాలుగు పాట‌లే అన్నారు.. కానీ ఐదో పాట కూడా వ‌చ్చింది. ఆడియో వేడుక లేద‌న్నారు.. కానీ ప్రీ రిలీజ్ వేడుక భారీగా జ‌ర‌గ‌బోతుంది. ఇక డాన్సులు లేవ‌నుకున్నారు కానీ ఇప్పుడు జానీ వ‌చ్చి ఉన్నాయ‌ని క‌న్ఫ‌ర్మ్ చేసాడు. మొత్తానికి ఈ పిక్ చూసిన త‌ర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ ఇప్పుడు.

More Related Stories