English   

నాగార్జున ఏంటి.. అంత సీరియ‌స్ అయ్యాడు..?

Nagarjuna-DevaDas
2018-09-26 11:06:57

నాగార్జున ఎప్పుడూ కూల్ గా ఉంటాడు.. అలాగే క‌నిపిస్తాడు కూడా. కానీ ఆయ‌న‌కు కూడా అప్పుడప్పుడూ కోపం వ‌స్తుంటుంది. అది బ‌య‌టికి కూడా వ‌స్తుంటుంది. ఇప్పుడు ఇలాంటి కోప‌మే నాగ్ మ‌రోసారి బ‌య‌ట చూపించాడు. అది కూడా త‌న చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌పై. అది కూడా కోపం అన‌కూడ‌దు.. అసహ‌నం అనాలేమో..? ఎందుకంటే అనుకున్న‌ది జ‌ర‌గ‌లేద‌ని అస‌హ‌నం అది.. అంతేకానీ కోపం అనకూడ‌దేమో..? ఒక్క శ్రీ‌రామ్ ఆదిత్య‌నే కాదు.. ఈ త‌రం ద‌ర్శ‌కులందర్నీ కామ‌న్ గా ఆడుకున్నాడు నాగార్జున‌. సింపుల్ గా చెప్పాలంటే ప్లానింగ్ లేద‌ని చెప్పాడు. త‌మ‌కు మూడు రోజుల ముందు సినిమా చూపించిన శ్రీ‌రామ్ ఆదిత్య‌ను లేజీ ఫెల్లో అన‌డంలో త‌ప్పేం లేద‌న్నాడు నాగ్. నెల రోజుల ముందు చూపించి ఉంటే క‌నీసం మార్పులు చేయ‌డానికి అయినా బాగుంటుంది.. ఈ ఒక్క ద‌ర్శ‌కుడే కాదు.. ఈ రోజుల్లో చాలా మంది ద‌ర్శ‌కులు ఇలాగే చేస్తున్నార‌ని.. మ‌రీ మూడు రోజుల ముందు కాపీ చూపిస్తే మార్పులు చేయాల్సి వ‌స్తే ఏం చేస్తారు.. ఎప్పుడు చేస్తారు.. అందుకే ఇదొక్క‌టి బుర్ర‌లో పెట్టుకోవాల‌ని ఇప్ప‌టి ద‌ర్శ‌కుల‌కు చెప్పాడు నాగార్జున‌. అలా చేస్తే నిర్మాత‌ల‌కు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంద‌ని.. ఏదైనా మార్చాల్సి వ‌చ్చినా టైమ్ ఉంటుంది కాబ‌ట్టి ఏ స‌మ‌స్యా ఉండ‌ద‌నేది నాగ్ భావ‌న‌. ఆయ‌న హీరోగానే కాదు.. నిర్మాత‌గానూ ఆలోచిస్తున్నాడు. అందుకే ద‌ర్శ‌కుల‌కు అక్షింత‌లు త‌ప్ప‌లేదు. మ‌రి నాగ్ చెప్పిన దారిని ఎంత‌మంది ద‌ర్శ‌కులు ఫాలో అవుతారో చూడాలిక‌..!

More Related Stories