English   

బొమ్మరిల్లు భాస్కర్ తో ఫ్రస్ట్రేటెడ్ హీరో

Venkatesh
2018-09-26 13:36:49

విక్టరీ వెంకటేష్ కథల విషయంలో ఎంత సెన్సిటివ్ గా ఉంటాడో అందరికీ తెలుసు. అలాంటిది ఆయన కూడా కొన్నాళ్లుగా ఆ విషయంలో టచ్ కోల్పోయాడు. దీంతో ఫ్లాపులు షాడోలా వెంటాడాయి. దీంతో ఏకంగా కెరీర్ కే డేంజర్ బెల్స్ మోగాయి. ఈ లోగా కొందరు కుర్రాళ్లు వేగంగా దూసుకురావడం.. ఆడియన్స్ టేస్ట్ లో మార్పులు రావడంతో సడెన్ గా బ్యాక్ అయ్యాడు వెంకీ. గురు తర్వాత ప్రస్తుతం ‘ఎఫ్2’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఫ్రస్టేటెడ్ మేన్ గా కనిపిస్తాడు వెంకీ అని చెబుతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో వెంకీతో పాటు వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. మొత్తంగా ఈ మూవీతో పాటు నాగచైతన్యతో కూడా ఓ సినిమాకు కమిట్ అయిన వెంకీ లేటెస్ట్ గా ఫ్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమాకూ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

బొమ్మరిల్లు సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ సెన్షేషన్ గా మారిన భాస్కర్.. తర్వాత పరుగు సినిమాతో ప్రశంసలు అందుకున్నాడు. కానీ అవన్నీ ఆరెంజ్ తో ఆవిరైపోయాయి. ఆరెంజ్ దెబ్బకు టాలీవుడ్ ఆల్మోస్ట్ భాస్కర్ ను బాయ్ కాట్ చేసినంత పనిచేసింది. చివరికి దిల్ రాజు కూడా పట్టించుకోలేదు. ఆ టైమ్ లో రామ్ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో తన రూట్ మార్చి ఒంగోలు గిత్త అంటూ యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు. బట్ ఇదీ ఫ్లాప్. తర్వాత చాలాకాలం ఖాళీగానే ఉన్న భాస్కర్ రీసెంట్ గా మళయాల బ్లాక్ బస్టర్ బెంగళూర్ డేస్ ను తమిళ్ లో రీమేక్ చేసి మరోసారి ఫ్లాప్ నే చూశాడు. మరి ఈ టైమ్ లో కొన్నాళ్లుగా అతనికి దిల్ రాజు మరో అవకాశం ఇచ్చాడనే వార్తలు వచ్చాయి. అది నిజమే అనేలా ఇప్పుడు తన కథతో వెంకటేష్ ను ఒప్పించాడంటున్నారు. ఒకవేళ వెంకీ నిజంగానే ఈ కథకు ఓకే చెప్పినట్టైతే దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది త్వరలోనే తెలుస్తుంది. 

More Related Stories